గాలులు వీక్.. రుతుపవనాలు ఎంట్రీ లేట్
ప్రస్తుతం సముద్రంపై గాలులు చాలా బలహీనంగా ఉన్నందున వర్షాల ప్రారంభం ఆలస్యమవుతోందని, ఇది జూన్ 3 తర్వాతే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేరళలోని నిర్ణీత 60 శాతం ప్రాంతాల్లో ఇప్పటికే వానలు పడాల్సింది. కానీ ప్రస్తుతం పశ్చిమ గాలులు మరీ వీక్‌గా మారడమే ఈ లేట్‌కి మెయిన్ రీజన్.
గత దశాబ్ద కాలపు డేటాను చూస్తే, 2016, 2023 సంవత్సరాలలో రుతుపవనాలు ఆలస్యంగా జూన్ 8న వచ్చాయి. అయితే 2024 (మే 30), 2025 (మే 24)లలో మాత్రం టైమ్ కంటే ముందే ఇండియాలోకి వచ్చేశాయి. ఈ శతాబ్దంలోనే అత్యంత ముందస్తుగా 2004 మే 18న రుతుపవనాలు రావడం విశేషం.
2005 నుండి 2025 మధ్య కాలంలో 2015 మినహా ఐఎమ్‌డి చేసిన ప్రెడిక్షన్స్ అన్నీ దాదాపు నిజమయ్యాయి. ఈ ఏడాది మే 16 నాటికే, అంటే షెడ్యూల్ కంటే వారం ముందే అండమాన్ సముద్రంలోకి రుతుపవనాలు ఎంటర్ అయినప్పటికీ, మెయిన్ ల్యాండ్‌లోకి రావడానికి మాత్రం బ్రేక్ పడింది. అయితే జూన్ 8వ తేదీ వరకు రుతుపవనాలు రాకపోయినా, దానిని తీవ్రమైన ఆలస్యంగా పరిగణించలేమని ఐఎండీ అంటోంది.