Cashless Healthcare Trust: ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. ఇకపై రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం !

Published : Jun 02, 2026, 07:45 AM IST

Cashless Healthcare Trust: తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి క్యాష్‌లెస్ ఈహెచ్‌ఎస్‌ అమలుకు రేవంత్ రెడ్డి సర్కార్ సరికొత్త హెల్త్‌కేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
జూన్ 2 నుంచి క్యాష్‌లెస్ వైద్యం.. రేవంత్ సర్కార్ బిగ్ డెసిషన్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల హెల్త్ టెన్షన్లకు రేవంత్ రెడ్డి సర్కార్ ఫుల్‌స్టాప్ పెట్టేసింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి సరికొత్త ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం’ (EHS) అమల్లోకి తెస్తోంది. పక్కా క్యాష్‌లెస్ పద్ధతిలో సూపర్ క్వాలిటీ వైద్యం అందించడమే దీని టార్గెట్.

ఇందుకోసం పవర్‌ఫుల్ ‘ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్ట్’ (EHCT) ఏర్పాటవుతుందని సీఎస్ కె.రామకృష్ణారావు స్పష్టం చేశారు. సచివాలయంలో 15 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిగిన హై-లెవెల్ మీటింగ్‌లో ఈ కీలక విషయాలు వెల్లడయ్యాయి.

24
ఫుల్ అటానమీతో నయా ట్రస్ట్.. పైసల మేనేజ్‌మెంట్ ఎలా చేస్తారు?

ఈ కొత్త హెల్త్‌కేర్ ట్రస్ట్‌కు కంప్లీట్ స్వయం ప్రతిపత్తి ఉంటుంది. గవర్నమెంట్ అధికారులు, ఉద్యోగ సంఘాల లీడర్లే దీనిని నడుపుతారు. పథకం కోసం సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖున ఉద్యోగుల అకౌంట్లలో జీతాలు పడగానే.. అదే రోజున ప్రభుత్వం కూడా తన వాటాను ట్రస్ట్ అకౌంట్‌లో జమ చేస్తుంది.

ఈ స్కీమ్ కోసం మే నెల జీతాల నుంచే బేసిక్ పేలో 1.5 శాతం కట్ చేయడంపై ఉద్యోగుల నుంచి ప్రశ్నలు రాగా.. జూన్ 2 నుంచి కార్డ్స్ ఇవ్వాలనే గట్టి సంకల్పంతోనే ఈ కట్ చేసారని అధికారులు క్లారిటీ ఇచ్చారు. 7 రోజుల్లో రెఫరల్ హాస్పిటల్స్ గైడ్‌లైన్స్, 10 రోజుల్లో క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ స్టార్ట్ అవుతుంది.

34
కండీషన్స్ అప్లై.. ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఏమిటి?

ఈ మీటింగ్‌లో ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి, ఇతర లీడర్లు పలు ఇంట్రెస్టింగ్ డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు.

• కపుల్స్ రూల్: భార్యాభర్తలు ఇద్దరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే.. కేవలం ఒక్కరి నుంచే 1.5 శాతం వాటా కట్ చేస్తారు.

• సీపీఎస్ ఉద్యోగులకు ఛాన్స్: సీపీఎస్ ఎంప్లాయీస్ రిటైర్ అయ్యాక కూడా ముందస్తుగా పే చేసి ఈ స్కీమ్‌లో కంటిన్యూ అవ్వొచ్చు.

• ముఖ్య సూచనలు: హెల్త్ కార్డ్‌లో సొంత బ్రదర్స్, సిస్టర్స్‌ని చేర్చాలని, పెళ్లి కాని పిల్లలకు 25 ఏళ్లు దాటినా వర్తింపజేయాలని, మెడికల్ ఖర్చులపై గరిష్ఠ పరిమితి లేకుండా ఓపీ సౌకర్యం కూడా ఇవ్వాలని కోరారు.

44
7.5 లక్షల మందికి పండుగే.. పరేడ్ గ్రౌండ్స్‌లో మెగా లాంచ్

ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 7.5 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, వారి ఫ్యామిలీస్ దీనివల్ల లబ్ధిపొందనున్నారు. జూన్ 2న జరిగే వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మొదటి బ్యాచ్ కింద 50 మంది ఉద్యోగులకు కొత్త ఈహెచ్‌ఎస్‌ కార్డులను పంపిణీ చేయనున్నారు. అక్కడ కుదరకపోతే జూన్ 10 లోపు గ్యారెంటీగా అందరికీ కార్డుల డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుందని అధికారులు తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories