IMD Cold Wave Alert : ఇప్పటివరకు వర్షాలు, చలి వేరువేరుగా వచ్చాయి. ఇప్పుడు రెండూ కలిసి తెలుగు రాష్ట్రాలపై పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాబోయే రోజుల్లో చలిగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెబుతోంది.
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం తీవ్రమైన చలి కొనసాగుతోంది. మరో నాలుగైదు రోజులు ఇలాగే ఉష్ణోగ్రతలు పడిపోతూ తీవ్రమైన చలివాతారణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే రాబోయే రోజుల్లో ఈ చలిగాలులకు వర్షాలు కూడా తోడయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే సింగిల్ డిజిట్ కు టెంపరేచర్ పడిపోవడంతో ఇబ్బంది పడుతున్న తెలుగు ప్రజలకు వర్ష హెచ్చరికలు మరింత కంగారు పెడుతున్నాయి.
26
బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు
బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నవంబర్ 17న మొదట ఓ అల్పపీడనం ఏర్పడుతుందని... దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే భారీ వర్షాలేమీ ఉండవు... చెదురుమదురు జల్లులే పడే అవకాశాలున్నాయట... కానీ ఈ వర్షాలకు చలిగాలులు తోడవడంతో ఇబ్బందులు తప్పవంటున్నారు.
36
బంగాళాఖాతంలో వాయుగుండం?
బంగాళాఖాతంలో అల్పపీడనం ముందుకు కదులుతూ బలపడుతుందని... వాయుగుండంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. దీంతో వర్షాలు జోరందుకునే ఛాన్సెస్ ఉంటాయంటోంది. ఇలా రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది.
నవంబర్ 17 నుండి డిసెంబర్ 7 వరకు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అంటే 17న మాత్రమే కాదు తర్వాత కూడా మరో అల్సపీడనం ఏర్పడి వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. మొంథా తుపాను తర్వాత వర్షాలు ఆగిపోయాయి... చలి తీవ్రత పెరిగింది... ఇప్పుడు మళ్లీ వర్షాలు మొదలువుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటోంది వాతావరణ శాఖ.
56
తెలంగాణను వణికిస్తున్న చలి
ప్రస్తుతం తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నవంబర్ 13 (గురువారం) ఆదిలాబాద్ లో అత్యల్పంగా 10.7 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక మెదక్ లో 12, హన్మకొండలో 14, నిజామాబాద్ లో 14.8, రామగుండంలో 15.4, హకీంపేటలో 16.5, దుండిగల్ లో 17, మహబూబ్ నగర్ లో 17.2, ఖమ్మంలో 17.6, నల్గొండలొ 19 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ప్రకటించింది.
హైదరాబాద్ లొ అత్యల్పంగా పటాన్ చెరు ఈక్రిశాట్ పరిసరాల్లో 12 డిగ్రీ సెల్సియస్ నమోయినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక హయత్ నగర్ లో 15, రాజేంద్రనగర్ లో 16.5, బేగంపేటలో 14.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
66
నేడు అత్యల్ప ఉష్ణోగ్రతలు
శీతాకాలం ఆరంభంలోనే గడ్డకట్టే చలిగాలులు వీస్తున్నాయి... 10 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం (నవంబర్ 14) తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు మరింత పడిపోయి అత్యంత చలి ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ ఇప్పటికే హెచ్చరించారు. హైదరాబాద్ లో 10-11 డిగ్రీ సెల్సియస్, నార్త్. వెస్ట్ తెలంగాణలో 7-10 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు.