IMD Weather Update : సూరీడితో వరుణుడి పోటీ.. మధ్యలో తెలుగు ప్రజలకు ఈ అవస్థలేంటి..?

Published : Apr 22, 2026, 08:03 AM IST

ఓవైపు సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు… మరోవైపు వరుణుడు వదలనంటున్నాడు. వీరిద్దరి పోటాపోటీతో తెలుగు ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. తెలంగాణ, ఏపీలో ఎండావాన పరిస్థితులు కొనసాగుతున్నాయి. 

PREV
15
తెలుగు రాష్ట్రాల్లో వింత వెదర్..

IMD Rain Alert : ఓవైపు ఎండలు, మరోవైపు వానలతో తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నమంతా సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు... మండుటెండలతో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమయంలోనే వేసవి కాలం ఫీలింగ్ ఉంటోంది... సాయంత్రం అయ్యిందంటే చాలు వర్షాకాలంలో మాదిరిగా ఆకాశం మేఘాలతో నిండిపోతోంది. చిరుజల్లులతో మొదలై కొన్నిచోట్ల భారీ వర్షం కురుస్తోంది. రోజూ ఇదే పరిస్థితి... దీంతో అసలిది వేసవి కాలమా, వానా కాలమా..? అనేది అర్థంకావడంలేదు.

25
తెలంగాణలో వర్షాలే వర్షాలు..

ఇప్పటికే తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి... మరికొన్నిరోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం మండుటెండలు, సాయంత్రం వర్షాలు... ఇదే వాతావరణ పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది. ఇవాళ (ఏప్రిల్ 22, బుధవారం) జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడా వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఇక ఈ రెండ్రోజులు (ఏప్రిల్ 22, 23) ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఉరుముల మెరుపులు, ఈదురుగాలులు, పిడుగులు ఈ వర్షాలకు తోడయి కొన్నిచోట్ల ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

35
నేడు హైదరాబాద్ వాతావరణం..

హైదరాబాద్ విషయానికి వస్తే ఎండావాన పరిస్థితులు కొనసాగుతాయట. సాయంత్రం GHMC పరిధిలోని కొన్ని ప్రాంతాలతో పాటు శివారు జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి లలో ఈదురుగాలులతో (గంటకు 40-50 వేగంతో) కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మధ్యాహ్నం మండుటెండలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

45
తెలంగాణలో హయ్యెస్ట్ టెంపరేచర్స్ ఇక్కడే..

ఇదిలావుంటే నిన్న (మంగళవారం, ఏప్రిల్ 21) తెలంగాణలో ఎండలు మండిపోయాయి. అత్యధికంగా మహబూబ్ నగర్ లో 42.8, భద్రాచలంలో 41.8, మెదక్ లో 41.6, ఆదిలాబాద్ లో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, నిజామాబాద్, రామగుండంలో కూడా 40 డిగ్రీలకు పైగానే టెంపరేచర్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో అత్యధికంగా బేగంపేటలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇవాళ కూడా ఇదేస్థాయిలో ఎండలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

55
ఏపీలో ఎండావాన పరిస్థితులు...

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ఎండలు తారాస్థాయికి చేరాయి. నిన్న (మంగళవారం) గరిష్ఠంగా తిరుపతి జిల్లా వరదయ్యపాలెం 44.4 డిగ్రీలు, 288 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇవాళ (బుధవారం, ఏప్రిల్ 22న) రాష్ట్రంలోని 76 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 134 మండలాల్లో వడగాలులు ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ద్రోణి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ వెల్లడించారు.

Read more Photos on
click me!

Recommended Stories