నేడు తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం ఉంటుందట… ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వేడి, ఉక్కపోతతో పొడి వాతావరణం ఉండి సాయంత్రం ఒక్కసారిగా జోరువానలు మొదలవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Telangana Andhra Pradesh Weather Update : తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదిలిపెట్టడంలేదు. ఇటీవల కురిసిన కుండపోత వానలకు తెలంగాణలో వరదలు సంభవించాయి.. కామారెడ్డి, మెదక్ వంటి జిల్లాల్లో ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో అందరికీ తెలిసిందే. అయితే గత వారంపదిరోజులుగా పెద్దగా వర్షాలు లేవు... దీంతో ప్రజలు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈక్రమంలో ఇప్పుడు మళ్లీ వర్షాలు జోరందుకుంటున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణ వర్షాలయితే ఓకే కానీ ఇటీవల ఒకేచోట అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి... ఇలాంటి వానలే ప్రజలను కంగారు పెడుతున్నాయి. అందుకే వర్షాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.
25
నేడు ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇలా ఇవాళ (సెప్టెంబర్ 10, బుధవారం) పలు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
35
హైదరాబాద్ వాతావరణ పరిస్థితి?
రాజధాని నగరం హైదరాబాద్ లో కూడా బుధవారం వర్షసూచనలు ఉన్నాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఉదయం, మధ్యాహ్నం పొడి వాతావరణమే ఉటుందని... సాయంత్రం సమయంలో వర్షం మొదలయ్యే అవకాశాలు ఉంటాయని తెలిపింది. నిన్న(మంగళవారం) శంషాబాద్ ప్రాంతంలో సడన్ గా మొదలైన వర్షం కొద్దిసేపు దంచికొట్టింది.. ఇలా 64 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది... కానీ మిగతా హైదరాబాద్ లో ఎలాంటి వర్షం కురవలేదు.
నేడు తెలంగాణ అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయట... ఈ వర్షాలు, ఈదురుగాలులతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
55
నేడు ఈ ఏపీ జిల్లాల్లో వర్షాలు
ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా నేడు (బుధవారం) వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా కోస్తా జిల్లాలకు భారీ వర్షసూచనలు ఉన్నాయి... మొత్తం 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంటకు 40-60 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది.