ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా నేడు పోలింగ్ జరుగుతోంది. అయితే ఉపరాష్ట్రపతి పోటీలో తెలంగాణ వ్యక్తి బరిలో నిలిచినా బిఆర్ఎస్ పార్టీ పోలింగ్ కు దూరంగా ఉంటోంది. ఎందుకో తెలుసా?
Vice President Elections 2025 : భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు దేశ రాజకీయాల్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ హీట్ పెంచాయి. ఇందుకు ప్రధాన కారణం ప్రతిపక్ష ఇండియా కూటమి తెలుగు వ్యక్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని పోటీలో పెట్టడమే. ఇలా బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ కూటమి తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బి. సుదర్శన్ రెడ్డిని గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి... ఇలా ఉపరాష్ట్రపతి ఎన్నికలు తెెలుగు వర్సెస్ తమిళ్ గా మారిపోయాయి. అయితే పార్లమెంట్ లో ఎన్డిఏకే సంఖ్యాబలం ఉన్నా ఇండియా కూటమి తటస్థ పార్టీలపై నమ్మకం పెట్టుకుంది. కానీ ఆ పార్టీలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ కు దూరంగా ఉంటున్నాయి. ఇలాంటి పార్టీలేవో ఇక్కడ తెలుసుకుందాం.
26
1. భారత రాష్ట్ర సమితి (తెలంగాణ)
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణకు చెందిన ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ పరిస్థితి విచిత్రంగా మారింది. ఆ పార్టీ ఇటు అధికార ఎన్డిఏ, అటు ప్రతిపక్ష ఇండియా కూటమిలోనూ లేదు... కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈ రెండు కూటమిల అభ్యర్థులే బరిలో ఉన్నారు. కాబట్టి ఎవరికి మద్దతిచ్చినా రాజకీయంగా ఇబ్బందులు తప్పవు... అందుకే బిఆర్ఎస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటోంది. ఇప్పటికే ఇవాళ (సెప్టెంబర్ 9, మంగళవారం) జరిగే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల పోలింగ్ లో పాల్గొనకూడదని నిర్ణయించిన ఆ పార్టీ అదిష్టానం ఎంపీలకు కూడా ఆదేశాలు జారీ చేసింది.
36
బిఆర్ఎస్ ఎన్డిఏకు మద్దతిస్తే..?
బిఆర్ఎస్ ఒకవేళ అధికార ఎన్డిఏ కూటమికి మద్దతిస్తే... తెలంగాణ వ్యక్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచినా బిఆర్ఎస్ ఎన్డిఏ పక్షాన నిలిచిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అసలు బిఆర్ఎస్ కు తెలంగాణ సెంటిమెంట్, తెలుగు ఆత్మగౌరవం ఏమీ పట్టవని... తమ రాజకీయ ప్రయోజనాలనే చూసుకుంటుందని ఆరోపిస్తాయి. ఈ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లి పొలిటికల్ గా డ్యామేజ్ చేసే అవకాశాలుంటాయి.
ఒకవేళ తెలుగువ్యక్తికి ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం ఉందికదా అని కాంగ్రెస్ కు మద్దతిస్తే... బిజెపి నుండి విమర్శలు ఎదురవుతాయి. ముందునుండి చెబుతున్నట్లు బిఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని... ఉపరాష్ట్రపతి ఎన్నికలతో అది స్పష్టమయ్యిందనే ప్రచారాన్ని తెలంగాణ బిజెపి చేస్తుంది. అంతేకాదు తమకు రాజకీయంగా ప్రధాని ప్రత్యర్థి కాంగ్రెసే అని బిఆర్ఎస్ భావిస్తోంది... ఇప్పుడు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తే క్యాడర్ తో పాటు ప్రజల్లోకి కూడా తప్పుడు సంకేతాలు వెళతాయని భావిస్తోంది.
56
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిఆర్ఎస్ వ్యూహాత్మక నిర్ణయం...
ఇలా బిజెపి కూటమి ఎన్డిఏ, కాంగ్రెస్ కూటమి ఇండియాలో ఎవరికి మద్దతిచ్చినా పొలిటికల్ డ్యామేజ్ జరిగే అవకాశాలుంటాయి. అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండటమే మంచిదని బిఆర్ఎస్ భావిస్తోంది... అందుకే ఇవాళ జరిగే పోలింగ్ లో పాల్గొనకూడదని ఎంపీలను ఆదేశించింది.
66
2. బిజెడి (బిజు జనతాదళ్), ఒడిషా
ఒడిషాకు చెందిన ప్రతిపక్ష బిజు జనతాదల్ పార్టీ కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటోంది. ఈ పార్టీ కూడా ఎన్డిఏ, ఇండియా ఏ కూటమిలోనూ లేదు... అందుకే ఈ పార్టీ రాజకీయంగా నష్టం జరగకుండా ఉండేందుకు ఏ పార్టీకి మద్దతివ్వకుండా ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బహిష్కరించింది. ఈ మేరకు ఇప్పటికే బిజెడి కూడా తమ నిర్ణయాన్ని ప్రకటించింది.