తెలంగాణలోని ఈ 17 జిల్లాల ప్రజలు జాగ్రత్త.. ఐఎండీ వార్నింగ్
తెలంగాణలోని దాదాపు 17 జిల్లాలకు వాతావరణ శాఖ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ ప్రాంతాల్లో వర్షాల తాకిడి కాస్త ఎక్కువగానే ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.
ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి, మహబూబ్‌నగర్ లలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
ఈ ప్రాంతాల్లో పిడుగులు పడటంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో అత్యధికంగా 10.1 సెం.మీ, నల్గొండ జిల్లా కట్టంగూరులో 8.2 సెం.మీ వర్షపాతం నమోదైంది.