Weather Updates : తెలంగాాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం చలిగాలులు బీభత్సం కొనసాగుతోంది. అయితే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోడానికి కారణమేంటో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయాయి... గడ్డకట్టే స్థాయిలో చలిగాలులు కొనసాగుతున్నాయి. సాధారణంగా డిసెంబర్ చివర్లో, జనవరి ఆరంభంలో ఈస్థాయి చలి ఉంటుంది. కానీ డిసెంబర్ ఆరంభంలోనే ఇలా చలి గజగజా వణికిస్తుంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందో అనే ఆందోళన ప్రజల్లో ఉంది. ఇలా అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోడానికి... చలి తీవ్రత పెరగడానికి ఉత్తర భారతదేశం నుండి వీస్తున్న శీతల గాలులే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
25
హిమాలయాల నుండి చలిగాలులు
హిమాలయాల నుండి వచ్చే గాలులు కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి... కొన్నిచోట్ల మంచు కురిసే స్థాయిలో చలిగాలులు వీస్తాయి. ఇక్కడి నుండి గాలులు దక్షిణాదివైపు ప్రయాణిస్తాయి. ఈ చలిగాలులకు తోడు పొడి వాతావరణం, మేఘాలు లేకపోవడంవల్ల భూమి నుండి వేడి త్వరగా బయటకు వెళ్లిపోతుంది. అందుకే తెెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉంటుంది… మరీముఖ్యంగా రాత్రులు, ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోయి చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
35
ఈ తెలంగాణ జిల్లాల్లోనే అత్యధిక చలి
తెలంగాణ విషయానికి వస్తే ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉంది... ఎందుకంటే దక్షిణాది నుండి వచ్చే చలిగాలులు ఇక్కడే ప్రవేశిస్తాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోనూ అత్యధిక చలి ఉంటుంది. ప్రస్తుతం ఈ జిల్లాల్లో అత్యల్పంగా 5 నుండి 10 డిగ్రీ సెల్సియస్ ఉష్షోగ్రతలు నమోదవుతున్నాయి.
ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ అత్యధిక చలి ఉంటోంది. నగరంలో కాంక్రీట్ బిల్డింగ్ లు, వాహనాలు పొల్యూషన్ కారణంగా చలి ప్రభావం తక్కువగా ఉంటుంది. కానీ పటాన్ చెరు, శేరిలింగంపల్లి, రాజేంద్ర నగర్ వంటి ప్రాంతాల్లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శివారు జిల్లాల్లో కూడా చలితీవ్రత ఎక్కువగానే ఉంటుంది.
55
ఏపీపై చలి పంజా
ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే మన్యం జిల్లాలైన విశాఖపట్నం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అరకు ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. రాయలసీమ జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతుంటాయి. కొండలు, అటవీ ప్రాంతాలు, పల్లెటూళ్లలో పొగమంచు, చలిగాలులు ఎక్కువగా ఉంటాయి.