Published : Aug 08, 2025, 07:06 PM ISTUpdated : Aug 08, 2025, 07:12 PM IST
Weekend Tour : వీకెండ్ లో తక్కువ బడ్జెట్ లోనే ఇలా వెళ్లి అలా తిరిగివచ్చేలా హైదరాబాద్ లో అనేక టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. వాటిగురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ కూల్ వెదర్ లో నగర పర్యటన అద్భుత అనుభూతిని ఇస్తుంది.
Hyderabad Travel Guide : వీకెండ్ వచ్చిందంటే చాలు చాలామంది ఎక్కడికి వెళదామా అని ఆలోచిస్తుంటారు. కానీ ఖర్చులకు భయపడి వెనకడుగు వేస్తుంటారు. అందుకోసమే ఈ వీకెండ్ లో అతితక్కువ ఖర్చులో హైదరాబాద్ నగర అందాలను, టూరిస్ట్ స్పాట్స్ ని చూసివచ్చేలా బడ్జెట్ ట్రావెల్ గైడ్ అందిస్తున్నాం. కేవలం రూ.500 రూపాయల కంటే తక్కువ ఖర్చుతోనే ఈ వీకెండ్ టూర్ ను పూర్తిచేయవచ్చు. అలాంటి ప్రాంతాలు హైదరాబాద్ లో ఏవేవి ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
DID YOU KNOW ?
ముత్యాల నగరం
హైదరాబాద్ ఒకప్పుడు ముత్యాల వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. కాబట్టి దీనిని ముత్యాల నగరం అని కూడా పిలుస్తారు. చాలాప్రాంతాల్లో ఇప్పటికీ మేలిమి ముత్యాలు లభిస్తాయి.
26
1. చార్మినార్
హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తుకువచ్చేది చార్మినార్. నగర నడిబొడ్డున ఠీవీగా నిలబడినట్లు కనిపించే ఈ పురాతన కట్టడం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. 1591లో దీన్ని కుతుబ్ షాహీలు నిర్మించారు... కాలక్రమేణ ఈ చారిత్రక కట్టడం హైదరాబాద్ సింబల్ గా మారిపోయింది. ఆ కాలంలోని కళాత్మక నిర్మాణానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది... దీని చుట్టుపక్కల స్ట్రీట్ షాపింగ్ గుర్తుండిపోయే అనుభూతిని ఇస్తుంది. ఛార్మినార్ సందర్శనతో పాటు షాపింగ్ కూడా కేవలం రూ.500 లోపు ఖర్చుతోనే పూర్తవుతుంది.
36
2. హిమాయత్ సాగర్
హైదరాబాద్ శివారులోని ఈ జలాశయం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో నిండుకుండలా మారింది. దీంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాబట్టి నగరవాసులు ఈ వీకెండ్ లో సందర్శించడానికి పర్ఫెక్ట్ ప్లేస్... అయితే భారీ వర్షాల నేపథ్యంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వుంటుంది. హైదరాబాద్ నుండి ఈజీగా వెళ్లిరావచ్చు.. ఖర్చు కూడా చాలా తక్కువ.
హైదరాబాద్ నడిబొడ్డున నీటితో నిండివున్న జలాశయం హుస్సేన్ సాగర్. మధ్యలో బుద్దుడి విగ్రహం... మరోవైపు నూతన సచివాలయ భవనం, నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం... ఇంకొవైపు జాతీయతను చాటుతూ రెపరెపలాడే భారీ మువ్వన్నెల జెండా... ఎన్టిఆర్, నెక్లెస్ రోడ్లు... ట్యాంక్ బండ్ పై మహనీయుల విగ్రహాలు... అబ్బో హుస్సేన్ సాగర్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు... స్వయంగా వెళ్లి చూడాల్సిందే. సాయంత్రం సమయంలో అయితే హుస్సేన్ సాగర్ అందాలు రెట్టింపు అవుతాయి.
56
4. బిర్లా టెంపుల్
దైవభక్తి ఎక్కువగా ఉండేవారు వీకెండ్ లో హాయిగా బిర్లా మందిర్ కు వెళ్లవచ్చు. రాష్ట్ర అసెంబ్లీ భవనానికి అత్యంత సమీపంలో, హుస్సెన్ సాగర్ కు నడకదూరంలో ఉంటుంది ఈ వెంకటేశ్వరస్వామి ఆలయం. ఎత్తైన కొండపై పాలరాతితో ఈ ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. స్వామివారిని దర్శించుకుని ఆలయ పరిసరాల్లోంచి నగర అందాలను వీక్షించవచ్చు. ఇక్కడినుండి చూస్తే హుస్సేన్ సాగర్ అందాలు రెట్టింపు అవుతాయి.
66
5. జూపార్క్
దేశంలోని అతిపెద్ద జూపార్కుల్లో హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ఒకటి. ఇక్కడ 100 పైగా జీవజాతులు ఉన్నాయి... పులులు, సింహాల నుండి అందమైన పక్షులు, ప్రమాదకరమైన పాములను ఇక్కడున్నాయి. ఓ చిన్నకుటుంబం అంటే భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్ళినా 500 రూపాయలలోపే ఖర్చవుతుంది. ఇలా చాలా తక్కువ ఖర్చులో పిల్లలు తెగ ఎంజాయ్ చేయాలంటే జూపార్క్ పర్ఫెక్ట్ స్పాట్.