Ghazala Hashmi: అమెరికాలో ట్రంప్‌కు ఎదురుదెబ్బలు తగలడం మొదలయ్యాయి. అతను నిల్చోబెట్టిన రిపబ్లికన్లను ఓడించి డెమోక్రాట్లు విజయం సాధించారు. వారిలో హైదరాబాద్ కు చెందిన గజాలా హహ్మీ కూడా కూడా ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ఏదో ఒక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. ఆయన తీసుకునే నిర్ణయాల పట్ల అమెరికన్లకు విసుగొచ్చినట్టుంది.. అందుకే తొలిసారి ట్రంప్ కు భారీ దెబ్బే వేశారు. అమెరికాలో జరిగిన మూడు ఎన్నికల్లో రిపబ్లికన్లను ఓడించి డెమోక్రాట్లను గెలిపించారు. ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తి. అయితే ఈ ఎన్నికల్లో మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సిందే హైదరాబాదులోని మలక్ పేటకు చెందిన మహిళ కూడా విజయం సాధించింది. ఆమె వర్జీనియా స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్ గా గెలిచింది. ఆమె పేరు గజాలా హష్మీ.
24
మలక్ పేటలో పుట్టి
గజాల ఫిర్దౌస్ హష్మి... ఈమె 1964 జూలై 5న హైదరాబాదులోని మలక్ పేటలో జన్మించింది. నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లిపోయింది. ఆమె తండ్రి, మేనమామ కూడా అమెరికాలోనే పనిచేసే వారు. దీంతో గజాలా హష్మి పూర్తిగా అమెరికాలోనే స్థిరపడిపోయారు. ఆమె బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసి ఇంగ్లీషులో పిహెచ్డి కూడా చేశారు. పాతికేళ్ల పాటు విద్యావేత్తగానే ఉన్నారు. కాలేజీలో ప్రొఫెసర్ గా కూడా పనిచేశారు.
34
రాజకీయాల్లో ఎంట్రీ
గజాల 2019లో వర్జీనియా సెనేట్ ఎన్నికల్లో పాల్గొన్నారు. అప్పుడే ఆమె తన తొలి గెలుపును నమోదు చేశారు. గత ఏడాది మే నెలలో తాను వర్జీనియా లెఫ్ట్ నెంట్ గవర్నర్ పదవికి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అప్పటినుంచి తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. డెమొక్రటిక్ అభ్యర్థి అయిన గజాలా హష్మి రిపబ్లికన్ అభ్యర్థిని ఓడించి లెఫ్టినెంట్ గవర్నర్ గా గెలిచారు. అలా గెలిచిన మొదటి ముస్లిం, మొదట భారతీయ అమెరికన్ గా చరిత్ర సృష్టించారు.
గజాల హష్మికి అజార్ రఫీక్ తో పెళ్లయింది. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఇప్పుడు జరిగిన మూడు ఎన్నికల్లో ట్రంప్ కి వ్యతిరేకంగానే ఓట్లు పడ్డాయి. తొమ్మిది నెలల నుంచి ట్రంప్ అమెరికాని పాలిస్తున్నాడు. అప్పటినుంచి ఆయన చేపట్టిన నిర్ణయాలన్నీ గొడవలకే దారితీసాయి. ఇప్పుడు జరిగిన అన్ని ఎన్నికల్లో డెమోక్రట్లే గెలవడంతో ట్రంప్ పై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది.