హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు ఎగ్జామ్ లేకుండానే జాబ్, వెంటనే అప్లై చేసుకొండి

Published : Nov 04, 2025, 05:24 PM IST

Nuclear Fuel Complex Jobs : కేవలం పదో తరగతి అర్హతతో ఎలాంటి పరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు… హైదరాబాద్ లో పోస్టింగ్… ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్లై చేసుకొండి. 

PREV
16
హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

NFC Jobs : కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని ముఖ్యమైన సంస్థలలో ఒకటి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC)... ఇది భారత అణుశక్తి శాఖలో భాగం. హైదరాబాద్ లోని ఈ పరిశ్రమలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది... అప్రెంటిస్ శిక్షణ కోసం మొత్తం 405 ఖాళీలను ప్రకటించారు. ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 15.11.2025.

26
పోస్టులవారిగా ఖాళీలు
  1. ఫిట్టర్ - 126 పోస్టులు
  2. టర్నర్ - 35 పోస్టులు
  3. ఎలక్ట్రిషన్ - 53 పోస్టులు
  4. మెషినిస్ట్ - 17 పోస్టులు
  5. అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్) లేదా కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ - 19 పోస్టులు
  6. ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ - 24 పోస్టులు
  7. ల్యాబోరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్) - 1 పోస్ట్
  8. మోటార్ మెకానిక్స్ (వెహికిల్) - 4 పోస్టులు
  9. డ్రాట్ మ్యాన్ (మెకానికల్) - 3 పోస్టులు
  10. కంప్యూటర్ ఆపరేటర్ ఆండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ - 59 పోస్టులు
  11. డీజిల్ మెకానిక్ - 4 పోస్టులు
  12. కార్పెంటర్ - 5 పోస్టులు
  13. ప్లంబర్ - 5 పోస్టులు
  14. వెల్డర్ - 26 పోస్టులు
  15. స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్) - 1 పోస్ట్
36
సాలరీ, వయోపరిమితి

ఈ అప్రెంటిస్ శిక్షణకు ఎంపికైన వారికి నెలకు రూ.9,600/- నుంచి రూ.10,560/- వరకు జీతం ఇస్తారు. ఇది శిక్షణ సమయంలో ఇచ్చే స్టైఫండ్.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 ఏళ్లు నిండి, 25 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబిసి అభ్యర్థులకు 3 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంది. ఇతర అభ్యర్థులకు కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడి వయసు సడలింపు ఉంటుంది.

46
విద్యార్హతలు

ఈ అప్రెంటిస్ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు (SSC Pass), సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ (ITI Pass) పూర్తి చేసి ఉండాలి. ఇదే ప్రాథమిక విద్యార్హతగా అడిగారు

56
పరీక్ష లేకుండా నేరుగా నియామకం

ఈ ఉద్యోగ ప్రకటనలో ముఖ్యమైన విషయం ఏంటంటే నియామక ప్రక్రియలో ఎలాంటి రాత పరీక్ష లేదు... అభ్యర్థులను వారి విద్యార్హతలో వచ్చిన మార్కుల ఆధారంగా (మెరిట్ లిస్ట్) మాత్రమే నేరుగా ఎంపిక చేస్తారు. అంటే, అర్హత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఈ ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

66
దరఖాస్తు విధానం

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 28.10.2025 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు... అంటే ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందన్నమాట. దరఖాస్తుకు చివరి తేదీ 15.11.2025. అభ్యర్థులు NAPS (నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్) వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. www.apprenticeshipindia.gov.in వెబ్‌సైట్‌లో, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, హైదరాబాద్ సంస్థ కోడ్ (NAPS Establishment Code: E11153600013) ఉపయోగించి దరఖాస్తు చేయాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఫీజు లేదు. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను చూసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories