Published : Aug 08, 2025, 03:13 PM ISTUpdated : Aug 08, 2025, 03:19 PM IST
Hyderabad Rains : ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్ కు వాతావరణ శాఖ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. నగరానికి వర్షం ముప్పు తప్పలేదని… శుక్రవారం భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
Hyderabad Rains : తెలంగాణను వర్షాలు వెంటాడుతున్నాయి.... గత నాలుగైదురోజులుగా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లో అయితే కుండపోత వానలు కురుస్తున్నాయి... కేవలం గంట రెండుగంటల్లోనే 100-150 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. ఒక్కసారిగా అత్యంత భారీ వర్షం కురవడంతో రోడ్లు జలమయం కావడమే కాదు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరుతోంది. కొన్నిచోట్ల సెల్లార్లలోకి పీకల్లోతు నీరుచేరి కార్లు, బైక్స్ ను ముంచేస్తున్నాయి.
DID YOU KNOW ?
క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?
సాధారణంగా గంట వ్యవధిలో 100 మిల్లీమీటర్ల (10 సెంటీమీటర్ల) కంటే ఎక్కువ వర్షపాతం ఒక చిన్న భౌగోళిక ప్రాంతంలో ( 10–30 చ.కిమీ) సంభవిస్తే దానిని క్లౌడ్ బరస్ట్ గా పరిగణిస్తారు.
25
హైదరాబాద్ కు వర్షం ముప్పు
అయితే హైదరాబాద్ కు ఇంకా వర్షం ముప్పు పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇవాళ (శుక్రవారం) వర్షం దంచికొడుతుందని ఇప్పటికే హెచ్చరించారు... తాజాగా మరో రెండుమూడు గంటల్లో నగరంలో వర్షం ప్రారంభం అవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఆకాశం మేఘాలతో కమ్మేసి గంభీరమైన వాతావరణం ఉంది... ఏ క్షణమైనా ఈ నల్లనిమబ్బులు కుండపోత వర్షాన్ని కురిస్తాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... అవసరం అయితేనే బయటకు రావాలని సూచిస్తున్నారు.
35
మళ్లీ క్లౌడ్ బరస్ట్ పరిస్థితులేనా?
మరో రెండుమూడు గంటల్లో హైదరాబాద్ లో మొదలయ్యే భారీ వర్షం రాత్రివరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. కొన్నిప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ జరుగుతోందా అనేలా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన విపత్తు నిర్వహణ సంస్థతో పాటు జీహెచ్‌ఎంసీ, హైడ్రా, పోలీస్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
సాయంత్రం సమయంలో జడివాన కురిసే అవకాశాలున్నాయన్న హెచ్చరికలు నగరవాసులకు కంగారుపెడుతున్నాయి. మరీముఖ్యంగా సైబరాబాద్ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ వార్త దడ పుట్టిస్తోంది... ఎందుకంటే సాధారణంగానే ఆఫీసుల సమయం ముగిసే సాయంత్రంవేళ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దీనికి వర్షం తోడయితే కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్స్ తప్పవు. వీకెండ్ వేళ తొందరగా ఇంటికి వెళదామన్న ఉద్యోగుల ఆశలపై ఈ వర్షం, ట్రాఫిక్ జామ్స్ నీళ్లు చల్లేలా ఉన్నాయి. ఇలా సైబరాబాద్ పరిధిలోనే కాదు హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ట్రాపిక్ జామ్స్ తప్పేలా లేవు… అందుకే ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసి, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
55
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్ తో పాటు శివారుజిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇటు సంగారెడ్డి జిల్లా పరిధిలోని లింగంపల్లి, పటాన్ చెరు ప్రాంతాల్లో భారీ వర్షం కురివొచ్చట... ఈ జిల్లాలోని మిగతాప్రాంతాల్లోనూ భారీ నుండి అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని ప్రకటించారు. ఇక రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, భువనగిరి జిల్లాల్లోనూ భారీ వర్షం కురుస్తుందని వెల్లడించారు. కామారెడ్డి, మెదక్, వేములవాడ, సిరిసిల్ల, భూపాలపల్లి, నిర్మల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.