హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నేడు ( సోమవారం) ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రత్యేకంగా ఆగస్టు 13న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. దీని ప్రభావంతో ఆగస్టు 13 నుంచి 16 వరకు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
గణాంకాలు:
ఆదివారం నిర్మల్ జిల్లా అక్కాపూర్‌లో 11.05 సెం.మీ., సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో 8.93, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 7.28, వరంగల్ జిల్లా దుగ్గొండిలో 6.70 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌తో పాటు నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి.