మద్యం ప్రియులకు గుడ్ న్యూస్, ప్రతీ 5 కి.మీలకు ఒక బీర్ కేఫ్.. అందుబాటులోకి డ్రాట్‌ బీర్లు. అసలేంటివీ అనేగా..

Published : Aug 03, 2025, 12:34 PM ISTUpdated : Aug 03, 2025, 12:49 PM IST

Draught Beer In Telangana: తెలంగాణ‌లో మ‌ద్యం ప్రియుల‌కు గుడ్ న్యూస్‌. కేవ‌లం పెద్ద పెద్ద ప‌ట్ట‌ణాల‌కే ప‌రిమితం అయిన డ్రాట్ బీర్లు ఇప్పుడు జిల్లాల్లోకి కూడా అందుబాటులోకి రానున్నాయి. 

PREV
15
తెలంగాణలో డ్రాఫ్ట్ బీర్ కేఫ్‌ల ఏర్పాటు

తెలంగాణలో మద్యం ప్రియులకు శుభవార్త అందింది. రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ బీర్ కల్చర్‌ను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో మాత్రమే ఉన్న మైక్రో బ్రూవరీల సేవలు త్వరలో జిల్లాలకు విస్తరించనున్నాయి.

DID YOU KNOW ?
36 గంటల్లోనే
మైక్రో బ్రూవరీలలో తయారయ్యే డ్రాట్ బీర్‌ను కేవలం 36 గంటల్లోమే వినియోగించాలి. అలాగే ఈ బీర్‌ బయటకు అమ్మకాలు నిషేధం.
25
అస‌లంటీ డ్రాట్ బీర్లు

హైదరాబాద్‌లో ప్రస్తుతం 18 మైక్రో బ్రూవరీలు పనిచేస్తున్నాయి. ఇవి బార్లు, పబ్బులకు కంటెయినర్ల ద్వారా సుమారు 1.8 మిలియన్ బల్క్ లీటర్ల బీర్ సరఫరా చేస్తున్నాయి. సాధార‌ణ బీర్ల‌తో పోల్చితే డ్రాట్ బీర్లు చాలా వ్య‌త్యాసం ఉంటాయి. ఈ బీర్ త‌యారైన కేవ‌లం 36 గంట‌ల్లోనే ఎక్సైరీ అవుతాయి. అలాగే ఇందులో ఆల్కాహాల్ శాతం కూడా త‌క్కువ‌గా ఉంటుంది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఇదొక సాఫ్ట్ డ్రింక్‌లాంటిద‌ని చెప్పొచ్చు. డ్రాట్ బీర్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

35
కొత్త బీర్ కేఫ్‌ల ప్రణాళిక

హైదరాబాద్‌లో ప్రతి 5 కిలోమీటర్ల దూరానికి ఒక బీర్ కేఫ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కేఫ్‌లు స్థానికంగా తయారైన బీర్‌ను నేరుగా వినియోగదారులకు అందిస్తాయి. దీని ద్వారా బీర్ ప్రియులు బార్లు లేదా పబ్బులకు వెళ్లకుండా తక్కువ ఖర్చుతో డ్రాఫ్ట్ బీర్‌ను ఆస్వాదించగలరు.

డ్రాట్ బీర్ ఎలా త‌యారు చేస్తారో ఈ వీడియోలో చూడొచ్చు.

45
జిల్లాలకు విస్తరణపై చర్యలు

మైక్రో బ్రూవరీలను జిల్లాల వరకు విస్తరించడానికి ప్రభుత్వం ఆలోచిస్తోంది. వరంగల్, హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ వంటి ప్రధాన పట్టణాల్లో ఈ కేఫ్‌లను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే సుమారు 50 కొత్త మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు అనుమతి కోరుతూ దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.

55
ఎలైట్ క్లబ్బులు, హోటళ్లకు ప్రత్యేక అనుమతులు

ప్రభుత్వం స్టార్ హోటళ్లు, క్లబ్బులు, ఎలైట్ మద్యం షాపులకు ఇన్-హౌస్ మైక్రో బ్రూవరీలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వాలని భావిస్తోంది. దీంతో, ఈ వర్గాలకు చెందిన కస్టమర్లు నేరుగా తాజా బీర్‌ను ఆస్వాదించే అవకాశం ఉంటుంది.

ఆదాయం పెరుగుదల

మైక్రో బ్రూవరీలు, బీర్ కేఫ్‌లు విస్తరించడంతో ఆబ్కారీ శాఖ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. స్థానిక తయారీ, స్థానిక విక్రయాల కారణంగా రాష్ట్రానికి పన్నుల రూపంలో అధిక ఆదాయం వస్తుంది. డ్రాట్‌ బీర్ కల్చర్ పెరగడంతో తెలంగాణ మద్యం రంగంలో కొత్త మార్కెట్ అవకాశాలు కూడా ఏర్పడతాయి.

Read more Photos on
click me!

Recommended Stories