Hyderabad: మ‌రో కోకాపేట లోడింగ్‌.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతంలో పెట్టుబ‌డి పెడితే మీ రాత మారిపోవాల్సిందే

Published : Mar 22, 2026, 12:40 PM IST

Hyderabad: హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రియల్ ఎస్టేట్ పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. కొకాపేట్ ఒకప్పుడు ఎలా వేగంగా ఎదిగిందో, ఇప్పుడు అదే దారిలో మ‌రో ప్రాంతం ముందుకు సాగుతోంది. ఇంత‌కీ ఆ ప్రాంతం ఏంటంటే.. 

PREV
16
దూసుకెళ్తున్న అభివృద్ధి

ఒక‌ప్పుడు కోకాపేట ఎలా అయితే అభివృద్ధి ప‌థంలో దూసుకెళ్లిందో ఇప్పుడు బుద్వేల్ అలాంటి ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఐటీ కారిడార్ స‌మీపంలో, ఎయిర్‌పోర్ట్ దగ్గరగా ఉండటం, ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ, భారీ రిజర్వాయర్ వ్యూ వంటి అనేక కారణాలతో ఈ ప్రాంతం పెట్టుబడిదారులు, గృహ కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. బుద్వేల్ హైదరాబాద్ నగర దక్షిణ భాగంలో, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో ఉంది. ఇది ఔటర్ రింగ్ రోడ్‌కు పక్కనే ఉండటం వల్ల నగరంలోని ముఖ్య ప్రాంతాలకు సులభంగా చేరుకునే అవకాశం ఉంది.

26
ఇక్కడి నుంచి ప్రధాన ప్రాంతాలు ఎంత దూరంలో ఉన్నాయంటే.

గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి సుమారు 12 కిలోమీటర్లు, శంషాబాద్ నుంచి సుమారు 11 కిలోమీటర్లు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు 18 కిలోమీటర్లు, పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడి నుండి ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. అలాగే రాజేంద్రనగర్‌లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ కూడా సమీపంలోనే ఉంది. ఒక వైపు హిమాయత్ సాగర్ సరస్సు అందమైన ప్ర‌దేశం కూడా ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది.

36
బుద్వేల్ ఎందుకు వేగంగా డెవలప్ అవుతోంది?

బుద్వేల్ అభివృద్ధికి ప్రధానంగా కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి.

* రోడ్డు కనెక్టివిటీ. ఔటర్ రింగ్ రోడ్, పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా నగరంలోని ప్రధాన ప్రాంతాలకు సులభంగా వెళ్లొచ్చు.

* ఐటీ కారిడార్ సమీపం. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఐటీ కేంద్రాలు దగ్గరగా ఉండటం వల్ల ఉద్యోగులు నివాసానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకునే అవకాశం పెరుగుతోంది.

* ఎయిర్‌పోర్ట్ సమీపం. అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉండటం వల్ల భవిష్యత్తులో వ్యాపార, రియల్ ఎస్టేట్ విలువలు పెరిగే అవకాశం ఉంది.

* ప్రభుత్వం చేపడుతున్న ప్రణాళికాబద్ధ అభివృద్ధి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఇక్కడ పెద్ద ఎత్తున లేఅవుట్లు అభివృద్ధి చేస్తోంది.

* ప్రకృతి వాతావరణం. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ సమీపం ఉండటం వల్ల ఈ ప్రాంతం ప్రశాంతమైన నివాస ప్రాంతంగా మారే అవకాశాలు ఉన్నాయి.

46
మౌలిక వసతులు, సౌకర్యాలు ఎలా ఉన్నాయి?

బుద్వేల్ పరిసరాల్లో ఇప్పటికే పలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. స్కూల్స్, కాలేజీలు వంటివి 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ వంటివి 4 కిలోమీట‌ర్ల దూరంలో అత్తాపూర్‌లో ఉన్నాయి. అలాగే మల్టీప్లెక్స్ థియేటర్లు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు కూడా సమీపంలోనే ఉన్నాయి. ఇటీవల కోత్వాల్ గూడా సమీపంలో 85 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈకో పార్క్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇది ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో టూరిజం హబ్‌గా మార్చే అవకాశాలు ఉన్నాయి.

56
బుద్వేల్‌లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది?

బుద్వేల్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం వేగంగా ఎదుగుతోంది. HMDAకు చెందిన 300 ఎకరాల్లో 100 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం వేలం వేసింది. 2023 సెప్టెంబర్‌లో జరిగిన వేలంలో ఎకరానికి కనిష్ట ధ‌ర రూ. 33.25 కోట్లు ప‌లికింది, ఇక గ‌రిష్ఠంగా ఏకంగా రూ. 41.75 కోట్లుగా ఉంది. ఈ వేలంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు భూములు కొనుగోలు చేసి పెద్ద ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి.

66
కొనుగోలుకు ఇదే స‌రైన స‌మయం.

రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, బుద్వేల్ భవిష్యత్తులో కొకాపేట్ తరహాలో భారీగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఐటీ హబ్‌లతో పోలిస్తే ధరలు ఇంకా తక్కువగా ఉండ‌డంతో ఇప్పుడే కొనుగోలు చేసే లాభం పొందొచ్చు. HMDA ప్రణాళికలతో మౌలిక వసతులు మెరుగుపడే అవకాశం ఉంది. భవిష్యత్తులో భూముల విలువ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంది. ఉద్యోగాలు, విద్య, వ్యాపార అవకాశాలు 10 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి.

మొత్తంగా చెప్పాలంటే, ఐటీ కారిడార్, ఎయిర్‌పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ, ప్రభుత్వ ప్రణాళికాబద్ధ అభివృద్ధి వంటి కారణాలతో బుద్వేల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మ్యాప్‌లో కొత్త హాట్ స్పాట్‌గా మారుతోంది. రాబోయే నాలుగు నుంచి ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాంతం భారీ మార్పు చూసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాల‌ను కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డులు పెట్టే ముందు నిపుణుల సూచ‌న‌లు తీసుకోవ‌డ‌మే మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories