దేశంలో అతిపెద్ద నగరాల్లో ఒకటి హైదరాబాద్. ఇక్కడ భుముల ధరలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల రియల్ ఎస్టేట్ కాస్త బూమ్ తగ్గిందన్న వార్తలు వచ్చాయి. కానీ తాజాగా నిర్వహించిన ఓ వేలంలో కళ్లు చెదిరే రేటు వచ్చింది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ వేగంగా దూసుకెళుతోంది. టెక్-హబ్‌గా పేరొందిన గచ్చిబౌలిలో తాజాగా భూమి ధరలు ఆకాశాన్ని తాకాయి. కమర్షియల్ స్థలాల వేలం సందర్భంగా ఒక్క గజానికి రూ.2.22 లక్షల చొప్పున భూమి విక్రయమవడంతో ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
27
కేపీహెచ్బీ వేలంలో రికార్డు ధరలు
జూన్ 23న కేపీహెచ్బీ (KPHB) హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో కమర్షియల్ స్థలాల వేలం నిర్వహించారు. ఈ వేలంలో నగరంలోని ప్రముఖ ప్రాంతాలైన గచ్చిబౌలి, బాచుపల్లి, చింతల్ వంటి ప్రాంతాల్లోని ప్లాట్లు బిడ్డింగ్‌కు వచ్చాయి. మొత్తం 53 మంది దరఖాస్తుదారులు పాల్గొనగా, గచ్చిబౌలిలోని నాలుగు స్థలాలకు అత్యధిక స్పందన లభించింది. వీటిలో ముఖ్యంగా డాగ్ పార్క్‌కు ఎదురుగా ఉన్న 1,487 చదరపు గజాల స్థలానికి భారీగా బిడ్డింగ్ జరిగింది.
37
ఎకరం రూ. 100 కోట్లు
వేలంలో గజానికి రూ.1.20 లక్షలుగా ప్రాథమిక ధర నిర్ణయించినా, తీవ్ర పోటీ మధ్య చివరకు ఒక్క గజానికి రూ.2.22 లక్షల ధర పలికింది. ఈ ధర ప్రకారం మొత్తం స్థలానికి రూ.33 కోట్లు వచ్చినట్టు సమాచారం. అంటే, ఒక్క ఎకరం భూమికి దాదాపు రూ.100 కోట్లు పలికినట్లు అర్థం. ఇది మునుపెన్నడూ లేని స్థాయిలో స్థలానికి విలువ లభించడం, గచ్చిబౌలికి ఉన్న డిమాండ్‌కు అద్దం పడుతోంది.
47
చింతల్, బాచుపల్లిలో
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం చింతల్‌లో ఉన్న ఎంజీఐ ప్రాంతంలో 10 ప్లాట్లు వేలానికి వచ్చాయి. అయితే, వీటిలో కేవలం మూడు మాత్రమే అమ్ముడయ్యాయి. అయినప్పటికీ సుమారు రూ.8 కోట్ల ఆదాయం సమకూరింది. అదే విధంగా, బాచుపల్లిలో ఉన్న 8 ప్లాట్లను వేలం వేయగా, నాలుగు మాత్రమే విక్రయమయ్యాయి. వీటిలో బీ-1 బ్లాక్‌లోని ఎఫ్-17 ప్లాటు అత్యధికంగా రూ.18.21 లక్షలకు అమ్ముడవడంతో అక్కడ కూడా కొంత స్థిరత కనిపించింది.
57
ప్రభుత్వానికి భారీగా ఆదాయం
ఈ మొత్తం వేలా ప్రక్రియ ద్వారా తెలంగాణ హౌసింగ్ బోర్డుకు రూ.65 కోట్ల ఆదాయం లభించిందని హౌసింగ్ బోర్డు కమిషనర్ గౌతమ్ తెలిపారు. గచ్చిబౌలిలో నిర్వహించిన నాలుగు స్థలాల వేలం ద్వారా రూ.55 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని ఆయన వెల్లడించారు. అంటే, నగర శివారులోని ఇతర ప్రాంతాల కన్నా గచ్చిబౌలికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది.
67
వృద్ధికి గల కారణాలు ఏమిటి?
గచ్చిబౌలి ప్రధానంగా ఐటీ కంపెనీలు, మల్టీనేషనల్ సంస్థలు స్థాపించడంతో వేగంగా అభివృద్ధి చెందింది. సమీపంలో ఉన్న కోకాపేట్, నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లు అన్నీ కలిపి ఒక రియల్ ఎస్టేట్ కేంద్రమవుతున్నాయి. మెట్రో, ఆర్గానిక్ రోడ్డు కనెక్టివిటీ, ఇంటర్నేషనల్ స్కూల్స్, ఆసుపత్రులు వంటి పలు వసతులున్న ప్రాంతంగా ఇది గుర్తింపు పొందింది.
77
నివాస సముదాయాలపై కూడా ప్రభావం
కేవలం కమర్షియల్ భూములే కాదు, నివాస ప్రాజెక్టులపై కూడా ఈ ధరల ప్రభావం చూపనుంది. ఇప్పటికే చాలా ప్రైవేట్ డెవలపర్లు కొత్త అపార్ట్‌మెంట్ల ప్రాజెక్టులను గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో ప్రకటిస్తున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ జోన్‌గా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.