ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో మెట్రో మూడో దశ గురించి కూడా చర్చ నడుస్తోంది. అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో నిర్మాణం చేపట్టాలన్న ఆలోచనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిజానికి బీఆర్ఎస్ హయాంలోనే ఈ అంశం చర్చకు వచ్చింది. ఇందులో భాగంగా..
శంషాబాద్ – పెద్ద అంబర్‌పేట్: 5 స్టేషన్లు (40 కిమీ)
పెద్ద అంబర్‌పేట్ – మేడ్చల్: 5 స్టేషన్లు (45 కిమీ)
మేడ్చల్ – పటాన్‌చెరు: 3 స్టేషన్లు (29 కిమీ)
పటాన్‌చెరు – నార్సింగి: 3 స్టేషన్లు (22 కిమీ).
ఈ మార్గాలు కలిపితే 136 కిలోమీటర్ల మెట్రో వలయాకారం ఏర్పడుతుంది. ఇది సాకారమైతే.. జిల్లాల నుంచి వచ్చే వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా ముందే ఆపేందుకు, శివార్లలోనుంచే మెట్రో కనెక్టివిటీ అందించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గిస్తుందని అనుకుంటున్నారు.