Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్

Published : Dec 05, 2025, 09:41 AM IST

Cold Wave: తెలంగాణ‌లో చ‌లి పంజా విసురుతోంది. అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్ర‌త‌లు గ‌ణ‌నీయంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. వ‌చ్చే 4 రోజులు ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారుతాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు. 

PREV
15
రాష్ట్రంలో మ‌రోసారి చ‌లి పంజా

దిత్వా తుపాను ప్ర‌భావం తెలంగాణ‌పై పెద్ద‌గా ప్ర‌భావం ప‌డ‌క‌పోయినా. రాత్రి ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. తుపాను బలహీనపడటం నేపథ్యంలో వచ్చే రోజుల్లో చలి తీవ్రత పెరగుతుందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

25
వ‌ర్షాలు లేవు కానీ..

బుధవారం ఉదయం వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారి తమిళనాడు, పుదుచ్చేరి మధ్యకు చేరింది. గురువారం నాటికి ఇది అల్పపీడనంగా ఇంకాస్త సద్దుమణుగుతుందని ఐఎండీ అంచనా వేసింది. రెండు రోజులపాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ముందస్తు హెచ్చరిక చేసినా రాష్ట్రంలో ఎక్కడా వర్షం పడలేదు. తుపాను దారి మారడం వల్ల ఈ ప్రాంతంపై ప్రభావం తక్కువగా కనిపించింది.

35
ఉత్తర తెలంగాణలో చలి హవా

ఉత్తర జిల్లాల్లో చలి పరిస్థితి స్పష్టంగా పెరిగింది. 18 జిల్లాల్లో రాత్రి టెంపరేచర్లు 15 డిగ్రీల లోగానే నమోదయ్యాయి.

10 డిగ్రీలు బజార్హత్నూర్ (ఆదిలాబాద్)

11.5 డిగ్రీలు కెరమెరి (కుమ్రంభీం ఆసిఫాబాద్)

11.9 డిగ్రీలు సాయినగర్ (నిర్మల్)

12.3 డిగ్రీలు సాలూరు (నిజామాబాద్)

12.5 డిగ్రీలు డోంగ్లి (కామారెడ్డి)

12.9 డిగ్రీలు ఝరాసంగం (సంగారెడ్డి)

అత్యధికంగా 19.5 డిగ్రీలు ధరూరు (జోగుళాంబ గద్వాల)లో నమోదైంది.

45
హైదరాబాద్‌లో ప‌రిస్థితి ఎలా ఉంటుందంటే.?

ప‌ట్ట‌ణంలో ఉష్ణోగ్రతలు మరోసారి తగ్గాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వద్ద 14.9 డిగ్రీలు నమోదై చలి ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఉదయానికల్లా గ‌డ్డ‌క‌ట్టే ప‌రిస్థితి కొన్ని చోట్ల క‌నిపిస్తోంది.

55
వ‌చ్చే 4 రోజులు చలి తీవ్రత

వచ్చే 4 రోజులు రాష్ట్రం మొత్తం పొడి వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. చలి మరింత పెరుగే అవకాశం ఉన్నందున దాదాపు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories