Hyderabad: ప్రయాణికులకు ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న హైదరాబాద్ మెట్రో

Published : May 20, 2025, 03:44 PM IST

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో ఒక శుభవార్త తెలిపింది. నష్టాలను తగ్గించుకునే క్రమంలో ఇటీవల మెట్రో ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యంతరాలతో అధికారులు కీల నిర్ణయం తీసుకున్నారు. 

PREV
15
ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ నిర్ణ‌యం.

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఊరటనిస్తూ మంగళవారం అధికారులు ఒక కీలక ప్రకటన చేశారు. ఇటీవల టికెట్ ధరలను పెంచిన ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల అభ్యంతరాల నేపథ్యంలో, పెరిగిన టికెట్ ధరల్లో 10 శాతం తగ్గింపు చేయాలని నిర్ణయించింది.

25
ఎప్ప‌టి నుంచి అమ‌ల్లోకి రానుంది.

ఈ తగ్గింపు ఈ నెల 24వ తేదీ (మే 24) నుంచి అమల్లోకి వస్తుంది. తాజా నిర్ణయం వల్ల రోజూ మెట్రోను వినియోగించే ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులకు కొంత ఆర్థిక ఉపశమనం లభించనుందని సంస్థ చెబుతోంది.

35
ముందు ఎంత పెంచారంటే?

మే 17వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన పెంపుతో కనిష్ఠ టికెట్ ధర రూ.10 నుంచి రూ.12కు, గరిష్ఠ టికెట్ ధర రూ.60 నుంచి రూ.75కు పెరిగింది. దీంతో ప్ర‌యాణికుల‌పై క‌నిష్టం రూ. 2 నుంచి గ‌రిష్టంగా రూ. 15 వ‌ర‌కు ఆర్థిక భారం ప‌డింది.

45
కొంత‌మేర త‌గ్గ‌నున్న ధ‌ర‌లు:

అయితే ఇప్పుడు సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ధరలపై భారం కొంతమేర తగ్గనుంది. చార్జీలు 10% తగ్గడంతో, ప్రజలకు ఇది ఉపశమనం కలిగించే అంశంగా చెప్పొచ్చు. ప్ర‌యాణికుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంత‌రాలు రావ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

55
ప్ర‌యాణికుల‌ను పెంచే ల‌క్ష్యంగా అడుగులు

ప్ర‌యాణికుల‌ను వ‌దులుకోకుండా మెట్రో మ‌రికొన్ని నిర్ణ‌యాలు తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సీజనల్ పాస్‌ల పై డిస్కౌంట్లు ప్రకటించాలన్న యోచనలో ఉన్న‌ట్లు స‌మాచారం. విద్యార్థులకు ప్రత్యేక కార్డులు లేదా డిస్కౌంట్స్ ప్రారంభించేందుకు కార్య‌చ‌ర‌ణ రూపొందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

మొబైల్ యాప్ ద్వారా బుకింగ్‌ చేస్తే అదనపు తగ్గింపు లభించేలా కొత్త ఆఫర్లు తీసుకురావాల‌ని యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా ఆఫ్ పీక్ అవర్స్‌ లో ప్రత్యేక టికెట్ ధరలు వర్తింపజేసే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories