Rain Alert: అడుగు బ‌య‌ట పెట్టే ముందు ఆలోచించుకోండి.. వ‌చ్చే మూడు రోజులు ఈ ప్రాంతాల్లో అతి భారీ వ‌ర్షాలు

Published : May 20, 2025, 01:27 PM IST

హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌ను వాతావ‌ర‌ణ శాఖ అధికారులు అల‌ర్ట్ చేశారు. వ‌చ్చే మూడు రోజులు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. ఇంకా అధికారులు ఏం చెప్పారంటే.. 

PREV
15
వాతావరణంలో అనూహ్య మార్పులు

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావ‌ర‌ణం విచిత్రంగా ఉంటోంది. ప‌గలంతా విప‌రీత‌మైన వేడి, ఉక్క‌పోత ఉంటే సాయంత్రం అయ్యేస‌రికి ఒక్కసారిగా వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డుతుంది. మేఘాలు క‌మ్ముకుని, ఇదురుగు గాలులు వీస్తూ వ‌ర్షం కురుస్తోంది. అయితే వ‌చ్చే మూడు రోజులు వాతావార‌ణం ఇలాగే ఉండే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. హైద‌రాబాద్‌తో పాటు తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో వ‌చ్చే మూడు రోజులు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు.

25
హైద‌రాబాద్‌లో మూడు రోజులు వ‌ర్షం.

హైదరాబాద్‌లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంద‌ని భారత వాతావరణశాఖ (IMD) తెలిపింది. ఇందులో భాగంగానే న‌గ‌రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా, తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా మే 23 వరకు వానలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

35
మే 22న భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం.

హైదరాబాద్‌లో మే 23 వరకు వర్షాలు కురుస్తాయని, అయితే మే 22 వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజుల్లో గాలులతో కూడిన వానలు కురుస్తాయ‌ని తెలిపారు. అలాగే మే 22 వరకు నగరంలో మేఘావృతమైన వాతావరణం కనిపించనుందని అధికారులు అంచ‌నా వేశారు.

45
ఇత‌ర ప్రాంతాల్లో కూడా

కేవ‌లం హైద‌రాబాద్‌లో మాత్ర‌మే కాకుండా తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో కూడా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల ఏకంగా 100 మిల్లీమీటర్ల వరకు వర్షం పడవచ్చని అంచనా వేశారు. వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయి అన్నారు.

55
ఉష్ణోగ్ర‌తలు ఎలా ఉండ‌నున్నాయి.?

హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌కారం మే 20న (మంగ‌ళ‌వారం) రాష్ట్రంలోని ఉష్ణోగ్రతలు 36°C – 40°C మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే మే 21 నుంచి 36 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లోనూ బుధ‌వారం నుంచి ఉష్ణోగ్రత 36 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుందని తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories