Hyderabad Metro: హైద‌రాబాద్ భ‌విష్య‌త్తును మార్చ‌నున్న మెట్రో.. ఎక్క‌డి వ‌ర‌కు విస్త‌రించ‌నుందో తెలుసా?

Published : Jul 15, 2025, 05:57 PM IST

ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌లో మెట్రో ఎంత కీల‌క పాత్ర పోషిస్తుందో తెలిసిందే. హైద‌రాబాద్‌లో మెట్రో అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత రియ‌ల్ ఎస్టేట్ ఓ రేంజ్‌లో విస్త‌రించింది. రానున్న రోజుల్లో హైద‌రాబాద్ మెట్రో మ‌రింత విస్త‌రించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. 

PREV
15
2050 నాటికి 640 కిలోమీటర్ల మెట్రో టార్గెట్‌

హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న వేగానికి అనుగుణంగా ప్రజారవాణా అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ దృష్ట్యా, రాబోయే 25 సంవత్సరాల్లో నగరానికి మొత్తం 640 కి.మీ. మేర మెట్రో రైలు మార్గాలను అభివృద్ధి చేయాలని లీ అసోసియేట్స్ అనే ప్రఖ్యాత కన్సల్టెన్సీ సంస్థ ప్రభుత్వానికి సూచించింది. ఈ కాలానికి హైదరాబాద్ జనాభా 3.5 కోట్లను దాటి, 65 లక్షలకుపైగా ప్రయాణికులు మెట్రో రైలు సేవలను వినియోగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

25
నాలుగు దశల్లో మెట్రో విస్తరణ లక్ష్యం

సమగ్ర మాస్టర్ ప్లాన్ 2050 లో భాగంగా ఈ మెట్రో విస్తరణను నాలుగు దశలుగా చేపట్టాలనే ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతానికి ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాలతో పోటీగా మెట్రో సేవలను విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం లీ అసోసియేట్స్ సంస్థను మాస్టర్ ప్లాన్ తయారీకి నియమించింది. రోడ్డు, ఎంఎంటీఎస్‌ సేవలతో పాటు మెట్రో విస్తరణపై ఈ సంస్థ ప్రధానంగా పరిశీలన నిర్వహిస్తోంది.

35
రెండో దశతో 231 కి.మీ.కు చేరనున్న మార్గం

ప్రస్తుతం ప్రతిపాదించిన‌ మెట్రో రెండో దశ ద్వారా మరో 162.5 కి.మీ. వరకు మార్గాలు విస్తరించనున్నారు. ఇది పూర్తి అయితే మెట్రో నెట్‌వర్క్ మొత్తం 231.5 కి.మీ.కు చేరుతుంది. ఈ దశను 2030 నాటికి పూర్తిచేస్తే, రోజువారీ ప్రయాణికుల సంఖ్య 15 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. మెట్రో సిస్టమ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించి, హైదరాబాద్‌ను గ్లోబల్ మెట్రోపాలిటన్ హబ్‌గా మార్చే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.

45
2040 నాటికి మూడో దశ

2040 నాటికి హైదరాబాద్ జనాభా మరింత పెరిగే నేపథ్యంలో మెట్రో సేవలను 340 కి.మీలు మించి మూడో దశ విస్తరణ అవసరం ఉంటుందని అధ్యయన సంస్థ అంచనా వేసింది. ఈ దశ విజయవంతంగా అమ‌లైతే మెట్రో ద్వారా ప్రయాణించే వారి సంఖ్య 35 లక్షలకు పైగా ఉండే అవకాశముందని తెలిపింది.

55
మెట్రో విస్తరణతోపాటు ఆర్థిక ప్రణాళికలపై కూడా దృష్టి

హెచ్‌ఎండీఏ పరిధిని 11 జిల్లాలకు విస్తరించడంతో 104 మండలాలు, 1355 గ్రామాలు ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నగర భవిష్యత్తు అభివృద్ధి, పారిశ్రామికర‌ణ‌, రవాణా మౌలిక వసతులపై సమగ్ర ప్రణాళిక అవసరమవుతోంది. 

అందుకోసం క్రిసిల్ ప్రైవేట్ లిమిటెడ్‌ను మరో కన్సల్టెన్సీగా ప్రభుత్వం నియమించింది. ఈ సంస్థ, నగర అభివృద్ధిలో భాగంగా 35 ఆర్థిక మండలాలు, లాజిస్టిక్ హబ్‌ల ఏర్పాటును ప్రతిపాదించింది. ప్రపంచంలోని టాప్‌-10 మెట్రో నగరాల సరసన హైదరాబాద్‌ను నిలబెట్టే దిశగా ఇది కీలకంగా మారనుంది.

Read more Photos on
click me!

Recommended Stories