Hyderabad: 2050లో హైద‌రాబాద్ ఎలా ఉండ‌నుంది? జ‌నాభా ఎంత కానుంది.? ఊహ‌కంద‌ని మార్పులు

Published : Jun 27, 2025, 10:45 AM ISTUpdated : Jun 30, 2025, 12:02 PM IST

హైద‌రాబాద్ న‌గ‌రం క్ర‌మంగా విస్త‌రిస్తోంది. ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా దూసుకెళ్తోంది. ఇప్ప‌టికే ఐటీ, ఫార్మా రంగాల‌కు కేరాఫ్‌గా మారిన హైద‌రాబాద్ మ‌రో 50 ఏళ్ల‌లో ఎలా మార‌నుంది.? ఇందుకు అనుగుణంగా ఎలాంటి మార్పులు చేయ‌నున్నారు.? ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
17
మెట్రో, రోడ్ల విస్తరణ

హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా మారుతోంది. దీంతో పాటు నగర రూపకల్పనలో కీలకంగా వ్యవహరిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) 2050 కోసం దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది.

ముఖ్యంగా న‌గ‌ర విస్త‌ర‌ణ‌ను పెంచే ప‌నిలో ప‌డింది. ఇందులో భాగంగానే న‌గరాన్ని ఔట‌ర్ రింగ్ రోడ్డు స‌రిహ‌ద్దులు దాటి, రీజిన‌ల్ రింగ్ రోడ్ వ‌ర‌కు విస్త‌రించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు.

27
భారీగా పెర‌గ‌నున్న జ‌నాభా

ప్రస్తుతం హైదరాబాద్ జనాభా 1.45 కోట్లుగా ఉంది. కానీ 2050 నాటికి జనాభా 3 కోట్లు దాటుతుందని HMDA అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా HMDA పరిధిని 7,257 చ.కిమీ నుంచి 10,472 చ.కిమీకి విస్తరిస్తోంది. నగర విస్తరణకు అనుగుణంగా ప్ర‌జ‌ల ప్ర‌యాణ అవ‌స‌రాల‌ను తీర్చేందుకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

37
మెట్రో, RTCపై దృష్టి

వాహనదారుల అవసరాల కోసం కాంప్రెసివ్ మొబిలిటీ ప్లాన్‌ను (CMP) రూపొందిస్తున్నారు. దీని ప్రధాన లక్ష్యం 2050 వరకు నగర రవాణా వ్యవస్థను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడమే. CMP పూర్తిస్థాయి నివేదిక 2025 ఆగస్టులో సిద్ధం చేయ‌నున్నారు. ఇప్పటికే మూడు సబ్-రిపోర్టుల పనులు ప్రారంభమయ్యాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిమాండ్‌పై నివేదిక పూర్తయింది.

47
ప్ర‌స్తుతం ప్ర‌యాణం ఎలా సాగుతోంది.?

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ప్ర‌తీ రోజూ ఆర్టీసీ బస్సుల్లో 10 నుంచి 15 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణిస్తున్నార‌ని ఓ అంచ‌నా. అలాగే మెట్రోలో 4 నుంచి 5 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణిస్తున్నారు. ప్ర‌స్తుతం మెట్రో 3 కారిడార్ల‌లో 69 కిలోమీట‌ర్ల మేర విస్త‌రించింది ఉంది. 2050 నాటికి మెట్రోను 600కిపైగా కిలోమీట‌ర్ల‌కు పెంచాల‌నే ల‌క్ష్యంతో ఉన్నారు.

57
మెట్రో విస్తరణ ప్రణాళిక:

మెట్రో విస్త‌ర‌ణ‌లో భాగంగా ఫేజ్-II: 74 కిమీ, ఫేజ్-IIB: 86 కిమీ ప్ర‌ణాళిక‌లో ఉంది. అయితే ఇది కార్య‌రూపం దాల్చేందుకు స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రం అనుమ‌తులు కోర‌గా నిరాశ ఎదురైంది. అయితే వ‌చ్చే ఏడాదిలో అయినా వీటికి అనుమ‌తులు ల‌భిస్తాయ‌ని అభిప్రాయాప‌డుతున్నారు. మెట్రో సెకండ్ ఫేజ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు కనీసం 10 ఏళ్ల సమయం పడుతుంది.

67
రహదారులు, ఫ్లైఓవర్‌లు, ట్రాఫిక్ పరిష్కారాలపై దృష్టి

మెట్రోతో పాటు, CMP ఆలోచ‌న‌లో రహదారుల అభివృద్ధి, ఫ్లైఓవర్‌లు, మెజర్ జంక్షన్ల నిర్మాణం కూడా ఉన్నాయి. వీటిలో ప్ర‌ధానంగా ప్రాధాన్యత గల మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక డీపీఆర్‌లు (Detailed Project Reports), చిన్న, మధ్య తరహాతో పాటు దీర్ఘకాలిక రవాణా మార్గాల సమన్వయం, లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుపరచడం, ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడం వంటి అంశాల‌ను ప‌రిశీలిస్తున్నారు.

77
RRR దిశగా నగర విస్తరణ

పెరుగుతోన్న జ‌నాభాకు అనుగుణంగా మౌలిక స‌దుపాయాలు ల‌భించాల‌న్నా, న‌గ‌రాన్ని మ‌రింత విస్త‌రించాల‌న్నా ఏకైక మార్గం RRR దిశ‌గా న‌గ‌రాన్ని అభివృద్ధి చేయ‌డ‌మే ఏకైక మార్గంగా భావిస్తున్నారు. HMDA తీసుకుంటున్న ఈ ముందస్తు చర్యల వల్ల హైదరాబాద్ సుస్థిరమైన, స్మార్ట్ నగరంగా 2050 నాటికి తయారవుతోంది. 

మెట్రో, రోడ్లు, బస్సులు వంటి రవాణా వ్యవస్థలు సమగ్రంగా అభివృద్ధి చెందుతూ నగర ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories