శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో పార్కింగ్ సమస్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే జీహెచ్ఎమ్‌సీ అధికారులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఏంటా నిర్ణయం.? దాంతో ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద గేట్ నెం.1 దగ్గర కొత్తగా నిర్మించిన మల్టీ-లెవల్ కార్ పార్కింగ్ సదుపాయం ఆదివారం ఉదయం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. 15 మీటర్ల ఎత్తు గల ఈ సదుపాయం ట్రయల్ దశలో ఉంది. ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి, పార్కింగ్ సౌలభ్యాన్ని పెంచడానికి GHMC ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.
25
ఉదయ వేళల్లో ఉచితంగా ట్రయల్ పార్కింగ్
ఉదయాన్నే వాకింగ్ లేదా జాగింగ్‌కు వచ్చినవారికి ఈ పార్కింగ్‌ను ఉచితంగా వాడే అవకాశం కల్పించారు. ఆదివారం కార్లు పార్క్ చేసిన వారికి ఎటువంటి ఛార్జీ లేదు. GHMC ఇంకా అధికారిక టికెట్ ధరను ప్రకటించలేదు. దీంతో పార్కుకు వచ్చిన వాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
35
కెపాసిటీ ఎంతంటే.?
ఈ పార్కింగ్ సదుపాయం 405 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో మొత్తం 72 కార్ల వరకు పార్క్ చేయవచ్చు. ఒక్కో రోటరీ స్టాక్‌లో 12 కార్లు వరుసగా నిల్వ చేస్తారు. బైకుల కోసం భవనం పక్కన ప్రత్యేక స్థలం కేటాయించారు.
ఈ పార్కింగ్ భవనంలో ఇలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. త్వరలో ఆన్‌లైన్ బుకింగ్స్ కోసం మొబైల్ యాప్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు కాఫీ కియోస్క్‌లు, చిన్న షాపులు వంటి వసతులు కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
55
నగరవ్యాప్తంగా విస్తరించేలా చర్యలు
GHMC అధికారులు పార్కింగ్ సదుపాయం పై ఫైనల్ రేట్లను త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపారు. ఈ మల్టీ-లెవల్ పార్కింగ్‌ను నగర వ్యాప్తంగా అమలవుతున్న స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థలో భాగంగా కలుపనున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ట్రయల్ రన్‌కు పాజిటివ్ స్పందన వస్తోంది.