వేలల్లో అమ్మకాలు.. లక్షల్లో అభిమానులు
మియాపూర్ ఫేమస్ పూరీ సెంటర్ లో క్రేజ్ ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఈ గణాంకాలే సాక్ష్యం...
పిండి వినియోగం: ప్రతిరోజూ దాదాపు 60 నుండి 70 కిలోల పిండి వాడతారు.
సాధారణ రోజుల్లో: రోజుకు 5 నుండి 6 వేల పూరీలు అమ్ముడవుతాయి.
వారాంతాల్లో (శని, ఆదివారాలు) : రద్దీ విపరీతంగా ఉంటుంది, దాదాపు 8 నుండి 10 వేల పూరీలు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి.
వ్యాపారం అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, తరం మారినా అదే నాణ్యతను, రుచిని కాపాడుకోవాలని ఈ మియాపూర్ ఫేమస్ పూరీ సెంటర్ నిర్వహకులైన నిరూపిస్తున్నారు. మీరు గనుక మియాపూర్ వైపు వెళ్తే, ఆ కట్టెల పొయ్యిపై కాలిన వేడి వేడి పూరీని, ఆ ప్రత్యేకమైన పాలతో చేసిన కర్రీతో తిని చూడండి. ఆ రుచి మీ జీవితాంతం గుర్తుండిపోతుంది.