ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.

Published : Dec 17, 2025, 12:58 PM IST

Hyderabad: హైదరాబాద్ మహా నగరంగా విస్తరిస్తోంది. ట్రిపులార్ రోడ్డు నిర్మాణం, మున్సిపాలిటీల విలీనంతో నగర విస్తృతి పెరుగుతోంది. దీనికి తోడు మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీలు శివారుల్లో పెట్టుబ‌డులు పెట్ట‌డంతో రియ‌ల్ ఎస్టేట్ ముఖ చిత్రం మారుతోంది. 

PREV
15
చందన్‌వెల్లి – హైదరాబాద్ సమీపంలో అభివృద్ధి చెందుతోన్న ప్రాంతం

హైదరాబాద్ సమీపంలో ఉన్న చందన్‌వెల్లి ఇప్పుడు హాట్ డెస్టినేషన్‌గా మారుతోంది. పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతుండటంతో ఈ ప్రాంతం విలువ వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు సాధారణ గ్రామంగా ఉన్న ఈ ప్రాంతం, ఇప్పుడు ఇండస్ట్రియల్ హబ్‌గా మారుతున్న దశలో ఉంది. దీనివల్ల భూముల డిమాండ్ పెరుగుతోంది.

25
చందన్‌వెల్లి ఇండస్ట్రియల్ పార్క్ ప్రభావం

సుమారు 1569 ఎకరాల విస్తీర్ణంలో చందన్‌వెల్లి ఇండస్ట్రియల్ పార్క్ విస్తరించి ఉంది. డేటా సెంటర్లు, మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు, టెక్ కంపెనీలు ఇక్కడ ఏర్పాట‌వుతున్నాయి. ఈ పార్క్ కారణంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ఉద్యోగాలు పెరిగితే నివాస అవసరం పెరుగుతుంది. అదే రియల్ ఎస్టేట్ ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు.

35
పెద్ద కంపెనీల పెట్టుబడులు

చందన్‌వెల్లిలో పెట్టుబడులు పెట్టిన ప్రధాన సంస్థలు.

* అమెజాన్ డేటా సెంట‌ర్ వేల కోట్ల పెట్టుబ‌డులు పెడుతోంది.

* మైక్రోసాఫ్ట్ డేటా సెంట‌ర్ దీర్ఘ‌కాల పెట్టుబ‌డుల‌కు ప్లాన్ చేస్తోంది.

* నెక్ట్రా (Airtel Group) – డిజిటల్ ఇన్‌ఫ్రాకు ప్లాన్ చేస్తోంది.

* వెల్‌స్ప‌న్‌, ఎస్ట‌ర్ ఫిల్మ్‌టెక్‌, ఆస్ట్రాల్‌, కంట్రోల్ఎస్ వంటి ఇండ‌స్ట్రీలు పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు పెడుతున్నాయి. ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల రాక‌తో చంద‌న్‌వెల్లి అభివృద్ధిలో ప‌రుగులు పెట్ట‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసిన వారికి దీర్ఘకాలంలో మంచి రిటర్న్ వస్తుందని రియ‌ల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

45
రియల్ ఎస్టేట్ గ్రోత్‌కు కీలకం ఇవే

చందన్‌వెల్లికి కనెక్టివిటీ చాలా బలంగా ఉంది. ORR నుంచి సులభంగా చేరుకునే అవకాశం ఉంది. శంషాబాద్‌, శాద్‌నగర్, షాబాద్ రోడ్ల క‌నెక్టివిటీ మెరుగ్గా ఉంది. బెంగళూరు హైవేకు సమీపంలో ఉండ‌డం కూడా క‌లిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ఈ రోడ్డు సౌకర్యాలు ఇండస్ట్రీలకు మాత్రమే కాదు, నివాస ప్లాట్లకు కూడా ప్లస్ పాయింట్. రాకపోకలు సులభంగా ఉండే ప్రాంతాల్లో భూముల ధరలు వేగంగా పెరుగుతాయి.

55
భవిష్యత్‌లో రియల్ ఎస్టేట్ ఎలా పెరగనుంది?

ఇప్పటికే ఇండస్ట్రియల్ గ్రోత్ మొదలైంది. రాబోయే రోజుల్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం హౌసింగ్ డిమాండ్ పెరుగుతుంది. లేఅవుట్లు, వెంచర్లు ఎక్కువగా వస్తాయి. కమర్షియల్ ప్లాట్ల విలువ పెరుగుతుంది. అద్దె ఆదాయం అవకాశాలు మెరుగవుతాయి. ఇవ‌న్నీ క‌లిపి ఈ ప్రాంతాన్ని ఇన్వెస్ట్‌మెంట్‌కి బెస్ట్ ఆప్ష‌న్‌గా మారుస్తున్నాయి. ఇప్పుడు పెట్టుబడి పెడితే 5–10 ఏళ్లలో మంచి క్యాపిటల్ గ్రోత్ కనిపించే ప్రాంతంగా చందన్‌వెల్లి మారుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories