హైద‌రాబాద్‌లో యాపిల్ భారీ ప్లాన్‌.. నెల‌కు రూ. 70 ల‌క్ష‌ల రెంట్‌తో ఆ ప్రాంతంలో..

Published : Jan 30, 2026, 10:08 AM IST

Hyderabad: హైద‌రాబాద్ న‌గ‌రం రోజురోజుకీ అభివృద్ధిలో ప‌రుగులు పెడుతోంది. అంత‌ర్జాతీయ కంపెనీలు హైద‌రాబాద్ కేంద్రంగా సేవ‌లందిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం యాపిల్ హైద‌రాబాద్‌లో విస్త‌ర‌ణ చేపట్టేందుకు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 

PREV
15
తొలి ఎంపిక‌గా హైద‌రాబాద్

భాగ్యనగరం హైదరాబాద్ రోజురోజుకీ కొత్త మలుపులు తిరుగుతోంది. ఐటీ, ఇన్నోవేషన్ రంగాల్లో ప్రపంచ పటంపై ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తోంది. అనుకూల వాతావరణం, మెరుగైన మౌలిక సదుపాయాలు, టాలెంట్ లభ్యత వంటి అంశాలు హైదరాబాద్‌ను అంతర్జాతీయ కంపెనీలకు తొలి ఎంపికగా మారుస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, డెలాయిట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్, క్వాల్కమ్ వంటి సంస్థలు నగరంలో భారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

25
ప్రభుత్వ మెగా ప్రాజెక్టులు.. అభివృద్ధికి కొత్త ఊపిరి

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. హైడ్రా చర్యలు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు, ఆర్ఆర్ఆర్, ఫ్యూచర్ సిటీ వంటి ప్రతిష్ఠాత్మక ప్రణాళికలు నగర రూపురేఖలను మార్చుతున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత పెంచుతున్నాయి.

35
నానక్‌రామ్‌గూడలో యాపిల్ భారీ విస్తరణ

టెక్ రంగంలో అగ్రగామిగా నిలిచిన యాపిల్ సంస్థ హైదరాబాద్‌లో తన ఉనికిని మరింత బలపరుస్తోంది. నానక్‌రామ్‌గూడలోని వేవ్ రాక్ ఐటీ పార్క్‌లో అదనంగా 57 వేల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఈ కొత్త స్పేస్ కోసం ప్రతి నెలా సుమారు రూ.71.67 లక్షల అద్దె చెల్లించనుంది. ఐదేళ్ల కాలపరిమితితో ఈ ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

45
ఉద్యోగావకాశాలకు ఊతం.. ఐటీ రంగానికి బలం

ఈ విస్తరణతో యాపిల్ కార్యకలాపాలు మరింత పెరగనున్నాయి. సాంకేతిక విభాగాల్లో కొత్త టీమ్స్ ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగే సూచనలు ఉన్నాయి. హైదరాబాద్ ఐటీ ఎకోసిస్టమ్‌కు ఇది మరో కీలక మైలురాయిగా మారనుంది.

55
హైదరాబాద్‌లో యాపిల్ ప్రయాణం..

తాజా లీజుతో యాపిల్ సంస్థ మొత్తం కార్యాలయ విస్తీర్ణం సుమారు 6.34 లక్షల చదరపు అడుగులకు చేరింది. గతేడాది ఇదే క్యాంపస్‌లో 64 వేల చదరపు అడుగుల స్థలాన్ని తీసుకుంది. ఇది రెండోసారి విస్తరణ కావడం విశేషం. 2016లో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన యాపిల్ అప్పట్లో 2.32 లక్షల చదరపు అడుగుల స్థలంతో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పుడు చూస్తే, భాగ్యనగరంపై ఆ సంస్థ పెట్టుకున్న నమ్మకానికి ఈ విస్తరణే నిదర్శనం.

Read more Photos on
click me!

Recommended Stories