రైల్వే ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. వ‌ర్షాల‌తో ఈ మార్గాల్లో నిలిచిపోయిన రైళ్లు

Published : Aug 28, 2025, 02:31 PM IST

తెలంగాణ‌లో కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ‌లో వ‌ర్షం దంచికొడుతోంది. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్‌, మెద‌క్‌, ఆదిలాబాద్ జిల్లాల్లో కురిసిన వ‌ర్షాల‌కు రోడ్ల‌తో పాటు రైల్వే ట్రాకులు దెబ్బ‌తిన్నాయి. 

PREV
15
నిలిచిన రైల్వే సేవ‌లు

గడచిన 24 గంటల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణలో పలు ప్రాంతాలు వరదలతో మునిగిపోయాయి. గ్రామాలు, పట్టణాలు జలమయం అయ్యాయి. రోడ్లతో పాటు రైలు మార్గాలు కూడా దెబ్బతిన్నాయి. దీనితో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ పలు రైళ్ల‌ను రద్దు చేసి, కొన్ని మార్గాల్లో తాత్కాలికంగా సేవలను నిలిపివేసింది.

DID YOU KNOW ?
రైల్వే అధికారులు ఏం చెబుతున్నారంటే.?
ప్రయాణానికి ముందు రైళ్ల షెడ్యూల్‌ను తప్పనిసరిగా చెక్ చేయాలని, IRCTC వెబ్‌సైట్ లేదా రైల్వే హెల్ప్‌లైన్ ద్వారా తాజా సమాచారం పొందాలని అధికారులు సూచిస్తున్నారు.
25
పూర్తిగా నిలిపివేసిన రైళ్లు

* 17003 – కాజీపేట్ నుంచి సిర్పూర్ టౌన్

* 17004, 17035, 17036 – బల్లార్షా నుంచి కాజీపేట్

* 77631 నుంచి 77638 వరకు – బీదర్ నుంచి కాలాబుర్గి లోకల్ సర్వీసులు

* 17035, 17036 – కాజీపేట్ నుంచి బల్లార్షా

* 67771, 67772 – సిర్పూర్ టౌన్ నుంచి కరీంనగర్

* 67773, 67774 – కరీంనగర్ నుంచి బోధన్

35
కొన్ని మార్గాల్లో పాక్షికంగా ర‌ద్దు

వరదల ప్రభావంతో కొన్ని ట్రైన్లను పూర్తిగా రద్దు చేయకుండా, ఒక నిర్దిష్ట మార్గం వరకు మాత్రమే నిలిపివేశారు. వీటిలో ప్ర‌ధాన‌మైన‌వి.

* 17033 – భద్రాచలం నుంచి బల్లార్షా వెళ్లాల్సిన రైలు కాజీపేట్–బల్లార్షా మధ్య రద్దయింది.

* 17034 – సిర్పూర్ టౌన్ నుంచి భద్రాచలం వెళ్లాల్సిన రైలు సిర్పూర్ టౌన్–కాజీపేట్ మధ్య నిలిపివేశారు.

* 17233, 17234 – సికింద్రాబాద్–సిర్పూర్ కాజాజ్ నగర్ రైళ్లు కాజీపేట్–సిర్పూర్ కాజాజ్ నగర్ మధ్య తాత్కాలికంగా రద్దయ్యాయి.

45
ప్రయాణికులకు రైల్వే సూచనలు

ప్రయాణానికి ముందు రైళ్ల షెడ్యూల్‌ను తప్పనిసరిగా చెక్ చేయాలని, IRCTC వెబ్‌సైట్ లేదా రైల్వే హెల్ప్‌లైన్ ద్వారా తాజా సమాచారం పొందాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే బుక్ చేసిన టికెట్లకు ప్రయాణం రద్దు అయితే, పూర్తి రిఫండ్ అందిస్తామని రైల్వే స్పష్టం చేసింది.

55
రైల్వే శాఖ అప్రమత్తం

భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ట్రాక్‌లను పునరుద్ధరించేందుకు ఇంజనీరింగ్ బృందాలు పనిచేస్తున్నాయి. నీరు తగ్గిన వెంటనే రైలు రాకపోకలను పునరుద్ధరించే ప్రయత్నం జరుగుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories