Rain Alert: వ‌చ్చే రెండు గంట‌లు అల్ల‌క‌ల్లోలం.. ఈ జిల్లాల ప్ర‌జ‌లు అస్స‌లు బ‌య‌ట‌కు రాకండి

Published : Aug 28, 2025, 11:29 AM IST

తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తర తెలంగాణ‌లో అత్యంత భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే 2 గంట‌ల్లో ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు. 

PREV
15
కరీంనగర్‌, సిరిసిల్లలో వాగుల ఉధృతి

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మానేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నర్మాల ప్రాంతంలోని ఎగువ మానేరు జలాశయం నిండుకుండలా మారడంతో దిగువకు వరద నీటిని విడుదల చేశారు.

25
వచ్చే రెండు గంటల్లో వర్ష సూచనలు

వాతావరణశాఖ తాజా అంచనాల ప్రకారం, వచ్చే రెండు గంటల్లో సిరిసిల్ల, కరీంనగర్‌, ఖమ్మం, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్‌, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సిద్దిపేట, మెదక్‌, జనగామ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.

35
అల్పపీడనం ప్రభావం – రాష్ట్రవ్యాప్తంగా జాగ్రత్తలు

అల్పపీడనం ప్రభావంతో గురు,శుక్ర‌వారాల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మరింతగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు సూచించారు.

45
మిడ్ మానేరు గేట్ల ఎత్తివేత

భారీ వర్షాల ప్రభావంతో మిడ్ మానేరు జలాశయంలో నీరు వేగంగా చేరుతోంది. వరద ఒత్తిడి తగ్గించేందుకు 17 గేట్లను ఎత్తి 33 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో కరీంనగర్‌, సిరిసిల్ల పరిసరాల్లో జాగ్రత్తలు అవసరం అని అధికారులు హెచ్చరిస్తున్నారు.

55
ఎల్లో అలర్ట్ జారీ

ఆదిలాబాద్‌, కుమురం భీం, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్‌, భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్‌, భద్రాద్రి, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని అంచనా వేయడంతో వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు ప్రకటించింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read more Photos on
click me!

Recommended Stories