Harish Rao: కేటీఆర్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే.. హ‌రీష్ రావు రియాక్ష‌న్ ఏంటంటే.?

Published : May 14, 2025, 06:58 AM IST

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయ‌కుల్లో హ‌రీష్ రావు ఒక‌రు. కేసీఆర్‌కు న‌మ్మిన బంటులా ఉంటూ అధినేత ఆదేశాల‌కు అనుగుణంగా ప‌నిచేస్తూ వ‌స్తున్న హ‌రీష్‌పై నిత్యం ఏదో ఒక ఆరోప‌ణ వ‌స్తూనే ఉంటుంది. హ‌రీష్ రావు వేరు కుంప‌టి పెట్టుకుంటార‌ని, పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తార‌ని ఇలా ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తుంటాయి. తాజాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న ఇలాంటి వార్త‌ల‌పై హ‌రీష్ స్ట్రాంగ్‌గా కౌంట‌ర్ ఇచ్చారు.   

PREV
15
Harish Rao: కేటీఆర్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే.. హ‌రీష్ రావు రియాక్ష‌న్ ఏంటంటే.?
Harish Rao, KTR

బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తనపై జరుగుతున్న ప్రచారాలను ఖండిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు గట్టిగా స్పందించారు. పార్టీపై తాను నమ్మకంతో ఉన్నానని, బీఆర్ఎస్‌లో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఆదేశాలే తనకు మార్గదర్శకమని, గీత దాటే ప్రసక్తే లేదని తేల్చేశారు. మంగ‌ళ‌వారం మీడియాతో పాటు మాట్లాడిన హ‌రీష్ కీల వ్యాఖ్య‌లు చేశారు. 

25
Harish Rao, BRS


"కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తా, కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యం," అని హరీష్ రావు పేర్కొన్నారు.
"మై లీడర్ ఈజ్ కేసీఆర్.. వాట్ ఎవర్ కేసీఆర్ సే, హరీష్ ఫాలో," అంటూ ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న విభేదాలపై ఆయన ఖండన వెల్లడి చేశారు. కొన్ని వందలసార్లు చెప్పినట్లే, తనకు పార్టీ క్రమశిక్షణే ప్రథమమని స్పష్టం చేశారు.

35
Harish Rao Profile

కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు:

కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు మండిపడ్డారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందన్నారు. రైతులు రోడ్లపై ధర్నాలు చేస్తుంటే, ముఖ్యమంత్రి మాత్రం అందాల పోటీల్లో బిజీగా ఉన్నారని విమర్శించారు. చివ‌రికి పాకిస్థాన్‌కు అప్పులు ఇస్తున్నార‌ని, తమ సీఎంకి మాత్రం నిధులు ఇవ్వడం లేదంటూ ఎద్దెవా చేశారు.

45

"అన్నం పెట్టే రైతులకు సమయం లేదు... కానీ ఫ్యాషన్ షోలకు సమయం ఉంది," అని హరీష్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం యాసంగిలో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామన్నా, ఇప్పటివరకు 40 లక్షలు కూడా కొనలేదన్నారు. కొన్న ధాన్యానికి 4,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నాయన్నారు. రైతుల ఖాతాల్లో 48 గంటల్లో డబ్బులు వేస్తామన్న మాటలు తేలిపోయాయని తెలిపారు. బోనస్ హామీలు ఎక్కడికీ పోయాయని, 512 కోట్ల రూపాయల బకాయిని ఇప్పటికీ చెల్లించలేదని విమర్శించారు. 
 

55
Harish Rao, BRS

ఎన్నికల ముందు కేసీఆర్ 10,000 ఇస్తామన్నారు, కాంగ్రెస్ 15,000 ఇస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీ అమలుకాదు అని హరీష్ రావు పేర్కొన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలపై కూడా ప్రశ్నలు వేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించిన హరీష్ రావు, త్వరలోనే బీఆర్‌ఎస్ పార్టీ రైతుల కోసం కార్యాచరణ ప్రకటిస్తుందని తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories