Published : Jun 29, 2025, 11:14 AM ISTUpdated : Jun 29, 2025, 07:40 PM IST
రోజురోజుకీ సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతోన్నా మోసాలు మాత్రం తగ్గడం లేదు. ప్రజల అత్యాశను పెట్టుబడిగా మార్చుకొని లక్షలు కొల్లగొడుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది.
అవంతి స్నేహ పేరుతో ఉన్న వాట్సప్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి(43)ని సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా సంప్రదించారు. గూగుల్‌లో రివ్యూలు ఇస్తే చాలు డబ్బులిస్తామని నమ్మించారు. ఒక్కో రివ్యూకు రూ. 40 చొప్పున డబ్బులు ఇస్తామన్నారు.
అన్నట్లుగానే మొదట కొన్ని చిన్న చిన్న టాస్కులు అందించారు. రివ్యూలకు రూ. 40 ఇవ్వడం మొదలు పెట్టారు. దీంతో క్రమంగా నమ్మిన అతను మరింత ముందుకెళ్లాడు.
25
క్రిప్టోలో పెట్టుబడులు పెట్టమంటూ
కొద్దిసేపటికే "ఇంకొన్ని టాస్క్‌లు చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి" అంటూ అతడిని ఓ నకిలీ వెబ్‌సైట్‌కు దారితీసింది. ఆ వెబ్‌సైట్‌లో క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టేలా సూచించింది. పెట్టిన డబ్బులపై భారీ లాభాలు వచ్చినట్లుగా చూపుతూ నకిలీ లెక్కలను చూపించారు. దీంతో అత్యాశ పడ్డ వ్యక్తి పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు.
35
బై మోర్ పేరుతో ఒత్తిడి
ఆ వెబ్‌సైట్‌లో "Buy More" అనే బటన్ క్లిక్ చేయగానే మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సూచనలు వచ్చాయి. పెట్టకపోతే అకౌంట్ ఫ్రీజ్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో కొంచెం కొంచెం పెట్టుబడులు పెంచుతూ పోయాడు. చివరికి ఇన్‌కమ్ ట్యాక్స్, జీఎస్‌టీ పేరుతో మొత్తం కలిపి రూ. 14.08 లక్షలు వసూలు చేశారు. ఇవన్నీ ఫేక్ పేమెంట్స్, నకిలీ లింకుల ద్వారా చేయించారు.
రూ. 14 లక్షలు పోయిన తర్వాత మోసపోయాన్న విషయం తెలుసుకున్న వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోంది. వాట్సాప్ ద్వారా సంప్రదించిన వ్యక్తి ఎవరన్న దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
55
ఇలాంటి మోసాల బారినపడకుండా ఉండాలంటే ఏం చేయాలి.?
"రూ.40 కే టాస్క్", "లాభాలు రెట్టింపు" అంటూ ఎవరైనా చెప్పినా, నిజమైన ఉద్యోగాల్లో ఇలా ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలాంటి అట్రాక్టివ్‌గా ఉన్నా ప్రాక్టికల్‌గా అసలు ఉండవు. తెలియని లింకులు, గూగుల్ రివ్యూ లాంటి టాస్క్ లింకులు ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు.
డోమైన్ పేరు, https వంటివి లేని లింక్స్, ప్రొఫెషనల్ డిజైన్ లేని వెబ్‌సైట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సరైన సమాచారం లేకుండా ఎప్పుడూ డబ్బు పెట్టొద్దు. ఒకవేళ మీరు సైబర్ నేరస్తుల చేతిలో మోసపోయినట్లు అనుమానం వస్తే వెంటనే సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేయాలి. అలాగే సైబ్ క్రైమ్ అధికారిక వెబ్ సైట్‌ను సంపద్రించాలి.