Telangana e PASS : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇక డైరెక్ట్‌గా మీ అకౌంట్‌కే స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు

Published : Jun 06, 2026, 11:45 AM IST

Telangana e PASS : తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే రానున్నాయి. 2026-27 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఈ-పాస్ రూల్స్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
విద్యార్థులకు అదిరిపోయే అప్‌డేట్.. తెలంగాణ ఈ-పాస్ రూల్స్ ఛేంజ్

తెలంగాణలోని స్టూడెంట్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే క్రేజీ న్యూస్ చెప్పింది. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల పంపిణీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు కాలేజీల అకౌంట్లలో పడే ఫీజు రీయింబర్స్‌మెంట్ పైసలను, ఇకపై నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

విద్యాశాఖ డేటాతో ఈ-పాస్ (ePASS) పోర్టల్‌ను లింక్ చేస్తూ, ఎక్కడా లేట్ కాకుండా ఫాస్ట్‌గా, పారదర్శకంగా నిధులు రిలీజ్ చేసేందుకు సర్కార్ పక్కా ప్లాన్ రెడీ చేసింది. ఆల్రెడీ ఎస్సీ విద్యార్థులకు ఉన్న ఈ సిస్టమ్‌ను.. ఇకపై ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులందరికీ వర్తింపజేస్తూ సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

25
2026-27 నుంచి కొత్త రూల్స్.. వారం రోజుల్లో కట్టేయాలి

ప్రస్తుతం చదువుతున్న వారు, 2025-26 వరకు అడ్మిషన్లు పొందిన వారికి పాత పద్ధతిలోనే ఫీజులు అందుతాయి. 2026-27 విద్యా సంవత్సరం నుంచి చేరే కొత్త బ్యాచ్‌లకు ఈ సరికొత్త రూల్స్ వర్తిస్తాయి. ప్రస్తుతం ఫీజుల పేమెంట్స్ లేట్ కావడం వల్ల అటు స్టూడెంట్స్, ఇటు కాలేజీ మేనేజ్‌మెంట్లు తెగ ఇబ్బందులు పడుతున్నారు. ఈ తలనొప్పికి శాశ్వతంగా చెక్ పెట్టేందుకు, అప్లికేషన్ అప్రూవ్ అయిన నెల రోజుల్లోనే ఫీజులు, ఉపకారవేతనాలు విడుదల చేసేలా సరికొత్త సిస్టమ్ తెస్తున్నారు. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన కండీషన్ ఉంది. ప్రభుత్వం విద్యార్థి అకౌంట్‌లో ఫీజు అమౌంట్ వేసిన వారం రోజుల్లోగా ఆ మొత్తాన్ని సంబంధిత కాలేజీకి చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏమరపాటుగా ఉండి కాలేజీకి కట్టకపోతే.. ఆ పైసలను విద్యార్థి నుంచి తిరిగి వసూలు చేసేలా కఠిన నిబంధనను కూడా రూల్ బుక్‌లో చేర్చారు.

35
ఆధార్ మస్ట్.. హాజరు 70 శాతం ఉండాల్సిందే

ఈ పథకం కింద పైసలు పడాలంటే కొన్ని రూల్స్ పక్కాగా ఫాలో అవ్వాలి. మీ ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ రికార్డుల్లో పేరు అక్షరం పొల్లు పోకుండా ఒకేలా ఉండాలి. అలాగే ఆధార్‌తో లింక్ అయిన యాక్టివ్ బ్యాంక్ ఖాతా కచ్చితంగా ఉండాలి. రిజిస్ట్రేషన్ టైమ్‌లో బయోమెట్రిక్ ఈ-కేవైసీ ద్వారా డీటెయిల్స్ వెరిఫై చేస్తారు. ఇకపై కాలేజీల్లో సర్టిఫికెట్ల ఫిజికల్ కాపీలు ఇవ్వాల్సిన పని లేకుండా డిజిటల్ వెరిఫికేషన్ ప్రక్రియను తీసుకొచ్చారు.

కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలను ఆన్‌లైన్‌లోనే వెరిఫై చేస్తారు. ఆధార్ అథెంటికేషన్, కాలేజీ డిజిటల్ సిగ్నేచర్, జిల్లా సంక్షేమాధికారి అప్రూవల్ పూర్తయ్యాకే నిధులు అకౌంట్లోకి వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా.. స్టూడెంట్స్‌కు కనీసం 70 శాతం క్లాస్ హాజరు ఉంటేనే ఈ స్కాలర్‌షిప్స్ అందుతాయి.

45
బకాయిలు ఉండవు.. నెలకు రూ. 200 కోట్లు విడుదల

ఫండ్స్ కొరత కారణంగా పాత బకాయిలు పేరుకుపోకుండా ఉండేందుకు ప్రభుత్వం సరికొత్త కార్యాచరణ రూపొందిస్తోంది. దీని కోసం ప్రతి నెలా సుమారు రూ. 200 కోట్లను రిలీజ్ చేయాలని భావిస్తోంది. విద్యా సంవత్సరం ముగిసేలోపే ఫీజులు, స్కాలర్‌షిప్‌లన్నీ క్లియర్ చేసేలా ప్లాన్ చేస్తోంది. కాలేజీల్లో పారదర్శకత కోసం 'పెర్ఫార్మెన్స్ అండ్ ప్రోగ్రెస్' మాడ్యూల్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.

దీని ప్రకారం ప్రతి కాలేజీలో ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ ఉండాలి. విద్యార్థుల క్లాస్ అటెండెన్స్, అకడమిక్ ప్రోగ్రెస్ ఆధారంగానే నిధులు విడతల వారీగా అకౌంట్లలో పడతాయి. ఈ ప్రాసెస్ లో స్టూడెంట్స్‌కు హెల్ప్ చేయడానికి ప్రతి కాలేజీలో ఒక నోడల్ ఆఫీసర్ ను కూడా అపాయింట్ చేయనున్నారు.

55
కాలేజీలు వేధిస్తే కఠిన చర్యలు

అడ్మిషన్ల టైమ్‌లో ఫీజుల కోసం కాలేజీలు విద్యార్థులను వేధించకూడదని ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. గవర్నమెంట్ స్టూడెంట్స్ అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాతే వారు కాలేజీకి కట్టాలి. ఒకవేళ ఫండ్స్ రిలీజ్ కావడంలో లేట్ అయితే ఆ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వానిదే తప్ప, దాన్ని సాకుగా చూపి కాలేజీలు అడ్మిషన్లు ఆపడానికి వీల్లేదు. ఈ కొత్త సిస్టమ్‌పై విద్యార్థుల్లో అవేర్‌నెస్ పెంచాలని జిల్లా కలెక్టర్లను, సంక్షేమ అధికారులను ఆదేశించారు.

Read more Photos on
click me!

Recommended Stories