Housing Scheme: ఆటో డ్రైవర్లకు డబుల్ బెడ్రూం ఫ్లాట్లు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

Published : Nov 17, 2026, 01:45 PM IST

Housing Scheme: రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సొంతింటి కలను నిజం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం రూ.220 కోట్లతో 2,000 ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్హతలు ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
ఆటో డ్రైవర్లకు జాక్‌పాట్.. హైదరాబాద్‌లో 2,000 ఇళ్లు కట్టిస్తున్న సర్కారు

ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న డ్రైవర్లకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆటో కార్మికుల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 220 కోట్ల వ్యయంతో ఆటో నగర్ కాలనీపేరుతో ప్రత్యేక గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టును అమలు చేసే బాధ్యతను తెలంగాణ హౌసింగ్ బోర్డుకు అప్పగిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

25
నగరం నలువైపులా 2000 ఇళ్ల నిర్మాణం

గుడిసెలు లేని తెలంగాణ లక్ష్యంగా బలహీన వర్గాలందరికీ సరసమైన ధరలకే ఇళ్లు అందించాలనే ప్రభుత్వ విధానంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, హౌసింగ్ కమిషనర్ ఇచ్చిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోసం మొత్తం 2000 ఫ్లాట్లను నిర్మించనున్నారు. నగరం నలువైపులా ఉండే ఆటో డ్రైవర్లకు అనుకూలంగా ఉండేలా ఈ స్థలాలను ఎంపిక చేశారు.

35
ఏ ఏరియాలో ఎన్ని ఫ్లాట్లు కడుతున్నారంటే?

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఎంపిక చేసిన నాలుగు ప్రాంతాల్లో ఒక్కో చోట 500 చొప్పున ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్లను హౌసింగ్ బోర్డు నిర్మించనుంది. ఆ ప్రాంతాల వివరాలు ఇలా ఉన్నాయి..

• బండ్లగూడ (నాగోల్‌లోని ఎల్‌ఐజీ / ఎల్‌ఐసీ కాలనీ) 500 ఫ్లాట్లు

• గండిగూడ 500 ఫ్లాట్లు

• పేట్ బషీరాబాద్ 500 ఫ్లాట్లు

• జల్‌పల్లి / లక్ష్మీగూడ 500 ఫ్లాట్లు

అయితే, ఈ సైట్లలో నిర్మాణ స్థితి, ఫ్లాట్ల విస్తీర్ణం, కల్పించే మౌలిక సదుపాయాలు, రవాణా కనెక్టివిటీకి సంబంధించిన పూర్తి వివరాలను జీవోలో ఇంకా వెల్లడించలేదు.

45
ఎలా అప్లై చేసుకోవాలి? నిబంధనలు ఏంటి?

ఈ ఫ్లాట్లను కేవలం ఆటో రిక్షా కార్మికులకు మాత్రమే ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఇవి జనరల్ కేటగిరీ ఇళ్లు కావు. దీనికోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు 'ఇందిరమ్మ ఇళ్లు - టవర్స్' పథకానికి వర్తించే నియమ నిబంధనలనే అనుసరించనుంది. లబ్ధిదారుల అర్హత ప్రమాణాలు, ఆర్థిక సహాయం, రిజర్వేషన్లు, ఎంపిక, ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ అంతా ఇందిరమ్మ ఇళ్లు-టవర్స్ గైడ్‌లైన్స్ ప్రకారమే జరుగుతుంది.

అర్హులైన ఆటో డ్రైవర్లను గుర్తించే ప్రక్రియను హౌసింగ్ బోర్డు త్వరలోనే చేపట్టనుంది. దరఖాస్తుల షెడ్యూల్, ఆదాయ పరిమితి, ఆర్థిక సహాయం మొత్తం, ఇళ్లు ఎప్పటికి అందిస్తారనే వివరాలను అధికారులు త్వరలో ప్రకటించనున్నారు.

55
లక్ష ఇళ్ల ప్రాజెక్టులో ఇదొక కీలక అడుగు

డిమాండ్ సర్వే ఆధారంగా క్యూర్ ప్రాంతం, మున్సిపల్ కార్పొరేషన్లలో ఎల్‌ఐజీ, ఎంఐజీ కేటగిరీల కింద లక్ష సరసమైన ఫ్లాట్లను నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద క్యూర్ ప్రాంతంలో 12,000 ఫ్లాట్ల నిర్మాణానికి కూడా అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ ప్రజలకు లాస్ట్-మైల్ కనెక్టివిటీ అందిస్తూ, కాలనీలను, మార్కెట్లను కలుపుతున్న ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా ఇళ్లు కేటాయించడం విశేషం.

హర్షం వ్యక్తం చేస్తున్న ఆటో యూనియన్లు

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆటో రిక్షా కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రికి, రవాణా శాఖ మంత్రికి జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) సభ్యుడు సత్తిరెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకం వల్ల ఎంతోమంది పేద ఆటో కార్మికుల కుటుంబాలకు సొంత గూడు దొరుకుతుందని యూనియన్ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories