పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్దరించాలంటూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు నిరసనల బాట పట్టారు. ఇప్పుడున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) ను రద్దు చేయాలని వీరు కోరుతున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా అందరు ఉద్యోగులు సామూహిక సెలవు పెట్టేందుకు సిద్దమయ్యారు... ఈ మేరకు తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (TGCPSEU) కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే లక్షన్నర మంది ఉద్యోగులు సెలవు కోసం అప్లై చేశారని తెలిపింది.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన పెన్షన్ హామీని అమలుచేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సిద్దమయ్యారు... అందుకే నవంబర్ 17న (మంగళవారం) అంటే రేపు ప్రభుత్వ ఉద్యోగులు సామూహిక సెలవు పెట్టాలని నిర్ణయించారు. జిల్లా కేంద్రాల్లో ధర్మదీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇలా టీచర్ల మాస్ క్యాజువల్ లీవ్ కారణంగా విద్యార్థులకు అనధికారిక సెలవు రాబోతోంది. స్కూల్ యధావిధిగా నడుస్తుంది... టీచర్లంతా సెలవులో ఉంటారు కాబట్టి నడపడం కష్టం... నడిచినా పాఠాలు చెప్పేవారు ఉండరు కాబట్టి సెలవు అన్నట్లే. స్కూల్స్ నడుస్తాయి కానీ క్లాసులు ఉండవన్నమాట.