కేవలం రాజధాని ప్రాంతంలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రధాన జిల్లాల్లో కూడా నిమజ్జనం రోజూ మద్యం షాపులు బంద్ కానున్నాయి.
• వరంగల్, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి: ఈ జిల్లాల్లో సెప్టెంబర్ 23 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 24 ఉదయం 6 గంటల వరకు వైన్స్, బార్లు బంద్ ఉంటాయి.
• జగిత్యాల జిల్లా: కలెక్టర్ ఆదేశాలతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కఠిన ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 71 మద్యం దుకాణాలు, 20 బార్లు, 304 బెల్లర్లను సెప్టెంబర్ 23 ఉదయం నుంచి సెప్టెంబర్ 25 ఉదయం వరకు ఏకంగా రెండు రోజుల పాటు మూసివేయనున్నారు.
• నిజామాబాద్ జిల్లా: ఇక్కడ సెప్టెంబర్ 22 నుంచే వైన్ షాపులపై ముందస్తు బంద్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.