గృహజ్యోతి పథకం ఉన్నా బిల్లు కట్టాల్సి వస్తుందా.? 200 యూనిట్లలోపు బిల్లు రావాలంటే ఇలా చేయండి

Published : Dec 04, 2025, 11:21 AM IST

Free current: వింట‌ర్‌లో గీజ‌ర్లు, హీట‌ర్ల ఉప‌యోగం ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో క‌రెంట్ బిల్లు సాధార‌ణంగానే ఎక్కువ వ‌స్తుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే క‌రెంట్ బిల్లు త‌గ్గించుకోవ‌చ్చు. అలాంటి కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
గృహ‌జ్యోతి ప‌థ‌కం

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత గృహ‌జ్యోతి ప‌థకాన్ని తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఈ ప‌థ‌కం కింద 200 యూనిట్లలోపు కరెంట్ వాడే వారికి ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. 200 యూనిట్లలోపు కరెంట్ వాడే వారు బిల్లులు చెల్లించాల్సిన పని లేదు. ఒక‌వేళ 200 యూనిట్లు దాటితే క‌రెంట్ బిల్లు చెల్లించ‌క త‌ప్ప‌దు. మ‌రి 200 యూనిట్ల లోపు క‌రెంట్ రావాలంటే పాటించాల్సిన కొన్ని చిట్కాలు ఇప్పుడు చూద్దాం.

25
అస‌లు క‌రెంట్ బిల్లు ఎందుకు ఎక్కువ వ‌స్తుంది.?

ఇంట్లో విద్యుత్ బిల్లు ఎక్కువ వస్తోందని చాలామంది బాధపడుతుంటారు. అయితే దీనికి ప్రధానమైన కారణం మన అజాగ్రత్త. ఉపయోగించని పరికరాలు ఆఫ్ చేయకపోవడం, పాత టెక్నాలజీ పరికరాలు వినియోగించడం, అధిక శక్తిని తీసుకునే గ్యాడ్జెట్లను తరచుగా వాడటం వంటివి మీ బిల్లును పెంచుతాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, ఇంట్లో విద్యుత్ వినియోగాన్ని సగానికి తగ్గించుకోవడం కూడా సాధ్యమే.

35
లైటింగ్‌, గృహ పరికరాల్లో ఆదా చేయడం

LED బల్బులు:

ఇంట్లో ఇంకా పాత CFL లేదా పసుపు లైట్స్ వాడుతున్నారా? వెంటనే LED లైట్లకు మారండి. LED బల్బులు సాధారణ బల్బులతో పోల్చితే 70–80% తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. దీని వల్ల బిల్లు తగ్గడమే కాకుండా, దీర్ఘకాలం పనిచేస్తాయి.

స్మార్ట్ పవర్ స్ట్రిప్స్:

టీవీలు, ఛార్జర్లు, మైక్రోవేవ్‌లు ఆఫ్ చేసినా ప్లగ్‌లో వేసి ఉంచినంత వరకు 'స్టాండ్‌బై పవర్' తీసుకుంటాయి. ఈ విద్యుత్ వృథాను ఆపడానికి స్మార్ట్ పవర్ స్ట్రిప్స్ ఉపయోగించండి. ఒక బటన్‌తో మొత్తం పరికరాలకు విద్యుత్ సరఫరా నిలిపేయవచ్చు.

45
సరైన పరికరాలను ఎంచుకోవడం

ఎలక్ట్రానిక్ పరికరాలు కొనే సమయంలో BEE స్టార్ రేటింగ్‌ను తప్పక పరిశీలించండి. 5 స్టార్ రేటింగ్ ఉన్న ఫ్రిజ్‌, AC, వాషింగ్ మెషీన్‌ వంటి పరికరాలు కొంచెం ఖరీదైనప్పటికీ, అవి చాలా తక్కువ కరెంట్‌ను తీసుకుంటాయి. దీర్ఘకాలంలో ఈ పరికరాలు మీ కరెంట్ బిల్లును గణనీయంగా తగ్గిస్తాయి. అదే పాత పరికరాలు ఎక్కువ విద్యుత్‌ను లాగి బిల్లును పెంచుతాయి.

55
గీజర్లు, వాషింగ్ మెషీన్లలో జాగ్రత్తలు

గీజర్లు:

గీజర్ విద్యుత్ వినియోగం చాలా ఎక్కువ. కాబట్టి అతి అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆన్ చేయండి. స్నానం చేసే 5 నిమిషాల ముందు ఆన్ చేసి, ఉపయోగించిన వెంటనే ఆఫ్ చేయడం మంచిది. కొంద‌రు ఆన్ చేసి అలాగే వ‌దిలేస్తుంటారు.

వాషింగ్ మెషీన్:

బట్టలు కొద్దికొద్దిగా వేశాక మెషీన్‌ను నడపడం వ‌ల్ల‌ కరెంట్, నీరు వృథా అవుతుంది. అందుకే వాషింగ్ మిషిన్‌కు స‌రిపోయంత వ‌ర‌కు దుస్తుల‌ను సేకరించి, ఒకే సారి ఫుల్ లోడ్‌తో వాష్ చేయండి. అలా చేస్తే విద్యుత్ వినియోగం తగ్గి బిల్లు కూడా తగ్గుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories