తెలంగాణ ప్రజలారా బిఅలర్ట్ .. హైరిస్క్ లో 10 జిల్లాలు, పొంచివున్న ప్లాష్ ప్లడ్ ముప్పు

Published : Aug 27, 2025, 09:28 PM ISTUpdated : Aug 27, 2025, 09:39 PM IST

తెలంగాణలో గురువారం కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కొన్ని జిల్లాలకు ప్లాష్ ప్లడ్ ముప్పు పొంచివుందట… కాబట్టి అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. మరి ఆకస్మిక వరదల ప్రమాదమున్న ఆ జిల్లాలేవో తెలుసా? 

PREV
15
తెలంగాణలో కుండపోత వర్షాలు

Flash Floods in Telangana : తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి... నిన్నటినుండి ఎడతెరిపి లేకుండా ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అయితే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యింది... ఆదిలాబాద్, సిరిసిల్ల, నిజామాబాద్, సంగారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో కూడా కుండపోత వర్షాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి... దీంతో రోడ్లన్ని వర్షపునీటితో నిండిపోయి ట్రాఫిక్ సమస్యలు మొదలయ్యాయి... అయితే ఇవాళ వినాయక చవితి సెలవు కావడంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు పెద్దగాలేవు.

కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఇప్పటికే కురుస్తున్న వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి... వాగులు వంకలు వరదనీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వరద ప్రవాహాల్లో చిక్కుకుని పలువురు ప్రమాదాలకు గురయ్యారు... మరికొందరు వరదనీటిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అనేక గ్రామాలను వరదనీరు చుట్టుమట్టడంతో రాకపోకలు నిలిచిపోయాయి... ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు.

అయితే ఇంతటితో వర్షబీభత్సం ముగియలేదు... మరింత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండి హెచ్చరిస్తోంది. పలు జిల్లాల్లో ప్లాష్ ప్లడ్స్ కు అవకాశాలున్నాయట... ఈ హెచ్చరికలు తెలంగాణ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అయితే ఏఏ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి? ఏఏ జిల్లాల్లో ప్లాష్ ప్లడ్స్ కు అవకాశాలున్నాయి? అనేది ముందుగానే తెలుసుకుంటే అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉంటారు. కాబట్టి ఈ సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

25
తెలంగాణలోని ఏ జిల్లాకు ఏ అలర్ట్

బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో ఆగస్ట్ ఆరంభంనుండి జోరువానలు కురుస్తున్నాయి. కానీ గత రెండుమూడు రోజులుగా వర్షాల తీవ్రత ఎక్కువయ్యింది.. హైదరాబాద్ తో సహా పలు జిల్లాలో కుండపోత వానలు పడుతున్నాయి... ఇవి రేపు (ఆగస్ట్ 28, గురువారం) కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో గురువారం భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయట... అందుకే ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇలా నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఇంకోరోజు కుండపోత వానలు తప్పవట... కాబట్టి ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే భారీ వర్షాలతో వరద పరిస్థితులు కొనసాగుతున్న ఈ జిల్లాలకు వర్ష హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇక తెలంగాణలోని మరో 16 జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాచయట... అందుకే వీటికి ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు. మరో 13 జిల్లాల్లో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయట... అందుకే వీటికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

35
తెలంగాణ 10 జిల్లాలకు ప్లాష్ ప్లడ్స్ అలర్ట్

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు సడన్ గా వరదలు సంభవించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదం పొంచివున్న 10 జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్ అలర్ట్ జారీచేశారు. ఇలా ఆదిలాబాద్, భద్రాద్రి, భూపాలపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదముందని హెచ్చరించారు. కాబట్టి ఈ జిల్లాల్లో నదులు, నీటి ప్రవాహాలు, చెరువులు, జలాశయాల సమీప ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... ప్రమాదకర పరిస్ధితులుంటే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

45
వరదల్లో చిక్కుకున్న ప్రజలు

సిరిసిల్ల జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తోంది. దీంతో మానేరు నది ప్రమాదకరంగా ప్రవహిస్తూ పరివాహక ప్రాంతాల్లోని పంటపొలాలను ముంచెత్తుతోంది... ఈ క్రమంలోనే గంభీరావుపేట సమీపంలో గేదెలను మేపడానికి వెళ్లిన ఐదుగురు వ్యక్తులు ఎగువ మానేరు వద్ద వరదప్రవాహంలో చిక్కుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి వెంటనే మానేరులో చిక్కుకున్నవారికి కాపాడేందుకు యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మెదక్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి... దీంతో ధూప్‌సింగ్ తండా చుట్టూ వరదనీరు చేరింది. గ్రామాన్ని వరదనీరు ముంచెత్తడంతో తండావాసులు ఇళ్లపైకి ఎక్కి ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు. తమను కాపాడాలని గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు.

ఇక ఇదే మెదక్ లో ఓ హాస్టల్ ను వరద ప్రవాహం చుట్టుముట్టింది... దీంతో అందులోని 400 మంది విద్యార్థులు ప్రాణభయంతో హాస్టల్ భవనం పైకి ఎక్కారు. విషయం తెలిసి అధికారులు ఫైర్ బోట్ల సాయంతో ఇప్పటికే 150 మందిని బయటికి తీసుకొచ్చారు. మిగిలిన విద్యార్థులను బయటకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిమాపక శాఖతో పాటు పోలీస్, రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొని పిల్లలను కాపాడుతున్నారు.

ఇలా తెలంగాణ జిల్లాల్లో వరదలు సంభవిస్తున్న నేపథ్యంలో సహాయం కోసం రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఫోన్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలో దాదాపు 30 మంది వరదనీటిలో చిక్కుకున్నారని... వారిని కాపాడేందుకు ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ పంపాలని బండి సంజయ్ కోరారు. ఆయన వినతిని మన్నించిన రక్షణమంత్రి వెంటనే హెలికాప్టర్లు పంపాలని హకీంపేటలోని డిఫెన్స్ అధికారులను ఆదేశించారు.

55
ప్రభుత్వ యంత్రాగాన్ని అలర్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పురాత‌న ఇళ్ల‌లో ఉన్న వారిని ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. వినాయ‌క మండ‌పాల స‌మీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మ‌ర్లతో భ‌క్తుల‌కు ప్ర‌మాదం వాటిల్ల‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ట్రాన్స్ కో సిబ్బందిని ఆదేశించారు.

హైదరాబాద్ తో పాటు కామారెడ్డి జిల్లాలో ప్రస్తుత పరిస్థితిని సీఎం రేవంత్ తెలుసుకున్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని... లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని... పొంగిపొర్లుతున్న చెరువులు, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదులు, వాగులు వంకల పరిసరాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సీఎం రేవంత్ సూచించారు.

హైద‌రాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క‌, పోలీసు సిబ్బంది స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌ని సీఎం పేర్కొన్నారు. అంటువ్యాధులు ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉన్నందున న‌గ‌ర పాల‌క‌, పుర‌పాల‌క‌, గ్రామ పంచాయ‌తీ పారిశుద్ధ్య సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించ‌డంతో పాటు ఎప్ప‌టిక‌ప్పుడు పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

Read more Photos on
click me!

Recommended Stories