US Embassy Jobs
US Embassy Jobs : భారతీయ యువత ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లాలని కలలు కంటుంటారు. యూఎస్ వెళితే ఇక లైఫ్ సెట్ అయిపోయినట్లే భావిస్తారు... నిత్యం డాలర్ డ్రీమ్స్ కంటుంటారు. కానీ USA కు వెళ్లకుండానే ఆ దేశ ప్రభుత్వంలో పనిచేసే అద్భుత అవకాశం తెలుగు యువతకు వచ్చింది.
అమెరికా విదేశాంగ విభాగం భారతదేశంలోని పలు నగరాల్లో ఎంబసీ ఆండ్ కాన్సులేట్స్ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఎంబసీల్లో ఉద్యోగాల భర్తీకి యూఎస్ సిద్దమయ్యింది. హైదరాబాద్ లో పాటు చెన్నై, కోల్ కతా,ముంబై నగరాల్లోని యూఎస్ ఎంబసీల్లో పనిచేసేందుకు భారతీయ యువత నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ లో పబ్లిక్ ఎంగేజ్ మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను యూఎస్ ఎంబసీ విడుదల చేసింది. ఇప్పటికే అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
విద్యార్హతలు :
హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ లో పబ్లిక్ ఎంగేజ్ మెంట్ అసిస్టెంట్ గా ఉద్యోగం పొందాలంటే గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి జర్నలిజం, కమ్యూనికేషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పొలిటికల్ సైన్స్, ఎకానమి లేదా మార్కెటింగ్ లో డిగ్రీ చేసివుండాలి.
ఉద్యోగ అనుభవం :
కనీసం నాలుగు సంవత్సరాలు మీడియా సంస్థలో లేదంటే యూనివర్సిటీ, ఎన్జివో, ఇంటర్నేషనల్ సంస్థలు, ఎంబసీ, గవర్నమెంట్ లేదా కార్పోరేట్ సంస్థలో ఉద్యోగం చేసివుండాలి. ఇక్కడ కూడా పబ్లిక్ రిలేషన్స్, జర్నలిజం, కమ్యూనికేషన్స్, మార్కెటింగ్ వంటి విధులు నిర్వర్తించి వుండాలి.
భాషలు :
ఇంగ్లీష్ లో స్పష్టంగా మాట్లాడటమే కాదు రాయడం, చదవడం కూడా బాగా వచ్చివుండాలి. ఎంపిక సమయంలో దీన్ని పరిశీలిస్తారు.
హైదరాబాద్ లో పనిచేయాల్సి వుంటుంది కాబట్టి తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడగలగాలి. రాయడం, చదవడం కూడా వచ్చింది. ఈ విషయాన్ని కూడా పరిశీలిస్తారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి :
ముందుగా గూగుల్ లో U.S.Department of state Diplomacy in Action పేజీని ఓపెన్ చేయాలి. అందులో భారతదేశంలోని అన్ని నగరాల్లో యూఎస్ ఎంబసీ ఆండ్ కాన్సులేట్స్ లో చేపడుతున్న నియామకాల వివరాలు వుంటాయి. అందులో 'Public Engagement Assistant - Press and Media' పై క్లిక్ చేయండి.
క్లిక్ చేయగానే మరో పేజి ఓపెన్ అవుతుంది. అందులో ఈ పబ్లిక్ ఎంగేజ్ మెంట్ అసిస్టెంట్ పోస్టు గురించి పూర్తి వివరాలు వుంటాయి. వాటన్నింటిని చదివాక ఈ పోస్టుకు మీరు అర్హులు అనుకుంటే మొదట్లోనే వుండే ''Apply to this vacancy' పై క్లిక్ చేయండి.
లాగిన్ కోసం ఈమెయిల్ ఐడి, పాస్ వర్డ్ అడుగుతుంది. వాటిని టైప్ చేసి లాగిన్ కండి. ఇవి లేకుంటే అక్కడే క్రియేట్ అకౌంట్ ఆప్షన్ కూడా వుంటుంది. మీ వివరాలను అందించి మెయిల్, పాస్ వర్డ్ క్రియెట్ చేసుకొండి.
మీ విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు, లాంగ్వేజ్ స్కిల్ , జాబ్ కు సంబంధించిన స్కిల్స్... ఇలా వివరాలన్నింటిని టైప్ చేసి సబ్మిట్ చేయాలి.
దరఖాస్తు ప్రారంభం, చివరి తేదీలు :
ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 31, 2024 నుండి అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతోంది.
జనవరి 16, 2025 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.
అవసరమైన పత్రాలు :
నివాస దృవీకరణ పత్రం ( ప్రభుత్వం నుండి పొందినదై వుండాలి)
విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్లు
రెస్యూమ్ లేదా సివి