టమాటాతో పాటు అన్ని కూరగాయల ధరలు తగ్గుతున్న ఉల్లి మాత్రం దిగిరావడంలేదు, ముఖ్యంగా చిన్న ఉల్లిపాయలు బాగా ఎక్కువగా వున్నాయి. కొద్దిరోజులు కిలో రూ.40-50 ఉండగా ఇప్పుడు రూ.70 నుండి రూ.80కి చేరుకుంది. చలికాలం సమీపిస్తున్నందున ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ మార్కెట్‌లో పెద్ద ఉల్లి రూ.30-40 రూపాయలకు కిలో వుంటే చిన్న ఉల్లి డబుల్ రేట్ వున్నాయి. దీంతో చేసేదేమిలేక పెద్ద ఉల్లినే కొనుగోలు చేస్తున్నారు.
ఇక హైదరాబాద్ లో బీట్రూట్ రూ.50/కిలో, పచ్చిమిర్చి రూ.30/కిలో, బంగాళాదుంప రూ.40/కిలో, క్యాప్సికమ్ రూ.35/కిలో, సొరకాయ రూ.25/కిలో ఉన్నాయి. చిక్కుడు రూ.50/కిలో, బీన్స్ రూ.55/కిలో, క్యారెట్ రూ.35/కిలో, కాలీఫ్లవర్ ఒక్కొక్కటి రూ.15-20, బెండకాయ రూ.35-40/కిలో, పొట్లకాయ రూ.30/కిలో వుంది.