Driving Licence: ట్రాఫిక్ పోలీసులు మాన్యువల్ ఫైన్లకు బదులుగా ఈ-ఫైన్ పంపిస్తున్నారు. మీ డ్రైవింగ్ లైసెన్స్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వస్తుంది. ఒకవేళ మీరు ఆ నెంబర్ మార్చితే మెసేజ్ రాదు. మరి ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో నెంబర్ ఎలా మార్చుకోవాలంటే.?
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ చాలా మందికి తర్వాత మారిపోతుంది. కానీ లైసెన్స్‌లో దానిని అప్‌డేట్ చేయరు. దీంతో ఈ-ఫైన్ లు, లైసెన్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్లు, ఇతర ముఖ్యమైన సమాచారం అందదు. కాబట్టి ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నంబర్‌ను లైసెన్స్‌తో అనుసంధానం చేసుకోవడం అవసరం.
25
పరివహన్ సారథి పోర్ట్‌లో..
ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలనుకునే వారు ముందుగా రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన పరివహన్ సారథి (Parivahan Sarathi) పోర్టల్‌ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత.. ఆన్‌లైన్ సర్వీసెస్ విభాగంలోకి వెళ్లాలి. ఆ తర్వాత డ్రైవర్స్/లెర్నర్స్ లైసెన్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. కొత్త పేజీ తెరుచుకున్న తర్వాత డ్రాప్‌డౌన్ జాబితా నుంచి మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ రాష్ట్రానికి సంబంధించిన సారథి డ్యాష్‌బోర్డ్ తెరుచుకుంటుంది.
35
మొబైల్ నంబర్ మార్చే ఆప్షన్ ఎలా సెలక్ట్ ఎంచుకోవాలి?
రాష్ట్ర డ్యాష్‌బోర్డ్‌లో పైభాగంలో ఉన్న Others ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే Update Mobile Number ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licence) ఎంపిక, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, లైసెన్స్ జారీ తేదీ, పుట్టిన తేదీ వంటి వివరాలన్నీ ఎంటర్ చేసి తర్వాత సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
వివరాలు సబ్మిట్ చేసిన తర్వాత మీ డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అందులో పేరు, పాత మొబైల్ నంబర్, తండ్రి పేరు వంటి వివరాలను ఒకసారి పరిశీలించాలి. అన్నీ సరిగ్గా ఉంటే Proceed బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత.. కొత్త మొబైల్ నంబర్ నమోదు చేయాలి. నంబర్ మార్చడానికి కారణం ఇవ్వాలి. కొత్త నంబర్‌కు వచ్చే OTPని నమోదు చేసి వెరిఫికేషన్ చేసుకోవాలి. OTP విజయవంతంగా వెరిఫై అయిన వెంటనే మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో కొత్త మొబైల్ నంబర్ అప్‌డేట్ అవుతుంది.
55
అప్‌డేట్ తర్వాత కలిగే ప్రయోజనాలు
మొబైల్ నంబర్ అప్‌డేట్ అయిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన అన్ని సేవలు మరింత సులభంగా అందుబాటులో ఉంటాయి. ఈ-ఫైన్ సమాచారం వెంటనే మొబైల్‌కు వస్తుంది. లైసెన్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్లు సకాలంలో అందుతాయి. అవసరమైనప్పుడు ఆన్‌లైన్ సేవలను సులభంగా ఉపయోగించుకోవచ్చు. జరిమానాల సమాచారం మిస్ కాకుండా ఉంటుంది. కార్యాలయాలకు వెళ్లకుండా చాలా సేవలను ఇంట్లో నుంచే పూర్తి చేసుకోవచ్చు.