రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో చాలా కీలకమని అధికారులు చెప్తున్నారు. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మెదక్, కుమరమ్ భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన భారీ తుపాను వాతావరణం ఏర్పడేలా కనిపిస్తోంది.
పిడుగులు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నందున, ఉరుములు వచ్చేటప్పుడు ఎవరూ చెట్ల కింద గానీ, ఓపెన్ ప్లేసెస్‌లో గానీ నిలబడకూడదని వాతావరణ అధికారులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అటు గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షపాతం ఒక్కసారిగా పుంజుకోనుంది. లోతట్టు ప్రాంతాల జనాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని అధికారులు తెలిపారు.