Bonalu Story of Potharaju: బోనాల జాతరలో అందరి కళ్లు పోతురాజు పైనే ఉంటాయి. బోనాల జాతరలో పోతురాజు పూనకాల అసలు రహస్యం ఏంటి? అసలు ఏవరీ పోతరాజు? అమ్మవారికి, పోతురాజుకు సంబంధం ఏంటి? ఈ ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
బోనాల జాతరలో పోతురాజు పూనకాల అసలు రహస్యం.. ఆ రౌద్ర రూపం వెనుక కథ ఇదీ
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బోనాల పండుగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది నెత్తిన బోనం ఎత్తిన మహిళలు, ఆ తర్వాత ఒంటి నిండా పసుపుతో భీకర రూపంలో కనిపించే పోతురాజు. ఆషాఢ మాసంలో జరిగే ఈ జాతరలో అందరి కళ్లు పోతురాజు పైనే ఉంటాయి. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా ఆయన వేసే స్టెప్పులు నెక్స్ట్ లెవెల్ వైబ్స్ ఇస్తాయి. అసలు ఎవరీ పోతురాజు? బోనాల జాతరలో ఆయనకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు?
26
పోతురాజు పుట్టుక వెనుక ఉన్న పురాణ రహస్యం ఏంటి?
పురాణాల ప్రకారం, పోతురాజు గ్రామ దేవతలైన మహంకాళి, పోచమ్మ, ఎల్లమ్మ వంటి ఏడుగురు అక్కాచెల్లెళ్లకు స్వయంగా తమ్ముడు. ప్రచారంలో ఉన్న ఒక కథ ప్రకారం.. ఒకసారి పార్వతీ దేవి పొరపాటున లక్ష్మీదేవి దివ్య శక్తి ఉన్న కొన్ని నీటి చుక్కలను మింగేసింది. ఆ నీటి చుక్కల నుండి ఏడుగురు సోదరి దేవతలు అంటే గ్రామ దేవతలు జన్మించారు. అయితే, ఆ దేవతల దివ్య శక్తులను కాపాడటానికి, వారికి తోడుగా ఉండటానికి ఒక శక్తివంతమైన రక్షకుడు అవసరమయ్యాడు. ఆ సమయంలోనే పోతురాజు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని జానపద కథల్లో ఇతడిని విష్ణుమూర్తి అవతారంగా కూడా పూజిస్తారు.
36
బోనాల జాతరలో పోతురాజు ఉగ్రరూపం.. గూస్‌బంప్స్ లుక్
బోనాల ఊరేగింపులో పోతురాజు పాత్రను చాలా హ్యాండ్సమ్‌గా, మంచి బాడీ బిల్డింగ్ ఉన్న వ్యక్తి పోషిస్తాడు. ఆయన లుక్ చూస్తేనే భక్తితో పాటు ఒక రకమైన భయం కలుగుతుంది. ఒంటి నిండా పసుపు దట్టంగా రాసుకుని, నుదుటిపై పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుంటాడు. కేవలం ఒక చిన్న ఎర్రటి ధోవతి మాత్రమే కట్టుకుని, కాళ్లకు, నడుముకు భారీ గజ్జలు కట్టుకుంటాడు. చేతిలో పెద్ద కొరడా పట్టుకుని డప్పుల సౌండ్‌కు పూనకంతో ఊగిపోతూ డాన్స్ చేస్తుంటే జాతరలో క్రేజ్ మామూలుగా ఉండదు.
ఊరేగింపులో పోతురాజు పలహారం బండి అంటే ప్రసాదం మోసుకెళ్లే వాహనం ముందు కూడా డాన్స్ చేస్తాడు. అమ్మవారి పూనకంలో ఉండి శిగం ఊగే మహిళలను పోతురాజే స్వయంగా నడిపించుకుంటూ ఆలయానికి తీసుకెళ్తాడు. ఆయన నడుముకు పచ్చటి వేప ఆకులను కట్టుకుంటాడు. చేతిలో ఉన్న కొరడాతో గాల్లో గట్టిగా కొడుతూ, భీకరమైన శబ్దాలు చేస్తూ రోడ్డుకు ఇరువైపులా ఉన్న భక్తులను అలరిస్తాడు. ఈ పండుగను ప్రారంభించేది, సమాజాన్ని కాపాడేది పోతురాజే అని భక్తుల నమ్మకం.
56
బోనాలు - పోతరాజు : గ్రామాలను కాపాడే రక్షకుడు.. కొరడా దెబ్బల కథ ఇదే
పూర్వ కాలంలో గ్రామాల్లో కలరా, ప్లేగు వంటి మహమ్మారులు వచ్చినప్పుడు, కరవులు సంభవించినప్పుడు ప్రజలు తీవ్రంగా భయపడేవారు. అవన్నీ అమ్మవారి ఉగ్రరూపం వల్లే జరుగుతున్నాయని నమ్మేవారు. ఆ సమయంలో అమ్మవారి తమ్ముడు, భక్తుడైన పోతురాజు రంగంలోకి దిగుతాడు. అమ్మవారి భీకరమైన కోపాన్ని, ఆ ఉగ్ర శక్తిని తనలోకి తీసుకుని, ఊరి ప్రజలకు ఎలాంటి కీడు జరగకుండా కాపాడుతాడు. అందుకే ఆయన పూనకంతో ఊగిపోతూ తనను తాను కొరడాతో కొట్టుకుంటూ దిష్టి తీస్తాడు. దుష్ట శక్తులను తరిమికొట్టి భక్తులకు రక్షణ కల్పిస్తాడు.
66
లష్కర్ బోనాల్లో పోతురాజు హంగామా
సికింద్రాబాద్‌లో జరిగే లష్కర్ బోనాల్లో పోతురాజుల హంగామా అంతా ఇంతా కాదు. ఇక్కడి శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం, శ్రీ దేవి పోచమ్మ ఆలయం, శ్రీ ముత్యాలమ్మ ఆలయం వంటి ప్రముఖ గుడుల దగ్గర వందలాది మంది పోతురాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఈ పండుగలో అమ్మవారికి కోళ్లు, మేకలు, తాటికల్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత జరిగే రంగం భవిష్యవాణి ముగిశాక, పోతురాజు ఆధ్వర్యంలోనే అసలైన ఊరేగింపు మొదలవుతుంది. తెలంగాణ జానపద సంస్కృతిలో పోతురాజు ఒక వీరుడిగా, దైవ స్వరూపంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.