హైద‌రాబాద్‌లో కొంద‌రు పెళ్ల‌యిన మ‌హిళ‌లు రాత్రి 10 త‌ర్వాత ఏం చేస్తున్నారో తెలుసా.? షాకింగ్ విష‌యాలు

Published : Apr 03, 2026, 07:43 AM IST

Dating App: భారత్‌లో సంబంధాల రూపం మారుతోంది. వివాహం పవిత్రమైన బంధంగా భావించే దేశంలో, వివాహేతర సంబంధాల కోసం ఉపయోగించే డేటింగ్ యాప్స్‌కు ఆదరణ పెరుగుతోంది. గ్లీడెన్ అనే ఎక్స్‌ట్రామ్యారిటల్ డేటింగ్ యాప్‌కి ఆదరణ పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

PREV
15
భారత్‌లో వేగంగా పెరుగుతున్న గ్లీడెన్ వినియోగం

వివాహితుల కోసం రూపొందించిన గ్లీడెన్ యాప్‌కు భారత్‌లో భారీ స్పందన వస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రధానంగా ఇప్పటికే వివాహితులైన లేదా దీర్ఘకాలిక సంబంధాల్లో ఉన్నవారు ఉపయోగిస్తున్నారు. సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం భారత్‌లో 4 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. చాలామంది తమ ప్రస్తుత సంబంధాల్లో భావోద్వేగ అనుబంధం లేదా ఆసక్తి తగ్గిందని భావించి కొత్త పరిచయాల కోసం ఈ తరహా డిజిటల్ ప్లాట్‌ఫాంలను ఆశ్రయిస్తున్నారు. బిజీ జీవనశైలి, ఉద్యోగ ఒత్తిడి, వ్యక్తిగత భావోద్వేగ అవసరాలు వంటి కారణాలు కూడా ఈ ట్రెండ్‌కు దోహదం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

25
ఏ నగరాల్లో ఎక్కువ మంది యూజర్లు?

గ్లీడెన్ డేటా ప్రకారం భారతదేశంలోని పెద్ద నగరాల నుంచే ఎక్కువ మంది యూజర్లు ఉన్నారు. యూజర్ల శాతాన్ని పరిశీలిస్తే బెంగళూరులో 18 శాతం, హైదరాబాద్‌లో 17%, ఢిల్లీలో 11%, ముంబైలో 9%, పుణేలో 7% మంది ఈ యాప్‌ను ఉప‌యోగిస్తున్నారు. ఈ గణాంకాలు నగర జీవనశైలిలో సంబంధాలపై ఉన్న దృక్పథం మారుతోందని సూచిస్తున్నాయి. అంతేకాదు, ఇప్పుడు ఈ ట్రెండ్ చిన్న నగరాలకు కూడా విస్తరిస్తోంది. లక్నో, చండీగఢ్, సూరత్, కోయంబత్తూర్, పాట్నా, గౌహతి వంటి నగరాల్లో కూడా యూజర్ల సంఖ్య పెరుగుతోంది.

35
యూజర్ల ప్రవర్తన ఎలా ఉంటుంది?

గ్లీడెన్ వెల్లడించిన వివరాల ప్రకారం యూజర్లలో 65 శాతం పురుషులు, 35 శాతం మహిళలు ఉన్నారు. అయితే గత రెండు సంవత్సరాల్లో మహిళల సంఖ్య వేగంగా పెరిగింది. మహిళల భాగస్వామ్యం 148 శాతం వరకు పెరిగినట్లు కంపెనీ చెబుతోంది. యాప్‌లో యూజర్లు రోజుకు సగటున 1 నుంచి 1.5 గంటల వరకు చాట్ చేస్తుంటారు. ఎక్కువ యాక్టివిటీ కనిపించే సమయాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య, రాత్రి 10 నుంచి అర్థరాత్రి వరకు యాప్‌లో ఎక్కువ‌గా ఉంటున్నారు. ఈ సమయాలు సాధారణంగా పనుల మధ్య విరామం లేదా ఒంటరిగా ఉండే సమయంలో వస్తాయని విశ్లేషకులు అంటున్నారు.

45
సంబంధాలపై మారుతున్న దృక్పథం

2024లో గ్లీడెన్ నిర్వహించిన ఒక అధ్యయనంలో 1,503 మంది వివాహితులు పాల్గొన్నారు. వీరి వయసు 25 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంది. ఈ అధ్యయనం ప్రకారం, 60 శాతం మందికి పైగా సంప్రదాయ సంబంధాల పద్ధతులను ప్రశ్నించే ధోరణి పెరుగుతోంది. కొంతమంది ఓపెన్ రిలేషన్‌షిప్, స్వింగింగ్, ఇతర ప్రత్యామ్నాయ సంబంధాల పద్ధతులపై ఆసక్తి చూపుతున్నట్లు కూడా అధ్యయనం తెలిపింది. ఇది భారతదేశంలో సంబంధాలపై ఉన్న ఆలోచనలు నెమ్మదిగా మారుతున్నాయని సూచిస్తోంది.

55
మహిళల భాగస్వామ్యం పెరగడం వెనుక కారణాలు

ఈ యాప్‌లో మహిళల సంఖ్య వేగంగా పెరగడం కూడా ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. కంపెనీ ప్రకారం, మహిళలకు యాప్‌ను ఉచితంగా ఉపయోగించే అవకాశం ఇవ్వడం వల్ల కూడా ఈ పెరుగుదల కనిపిస్తోంది. మరొక కారణం మహిళల్లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే ధోరణి అని సంస్థ పేర్కొంది. అయితే ఈ పరిస్థితిపై సమాజంలో చర్చ కొనసాగుతోంది. కొందరు దీనిని వ్యక్తిగత స్వేచ్ఛగా భావిస్తుంటే, మరికొందరు కుటుంబ వ్యవస్థపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మొత్తంమీద డిజిటల్ యుగంలో వ్యక్తిగత సంబంధాల రూపం వేగంగా మారుతోంది. గ్లీడెన్ వంటి ప్లాట్‌ఫాంల పెరుగుతున్న వినియోగం ఈ మార్పున‌కు ఉదాహరణగా కనిపిస్తోంది. భారత్‌లో వివాహం ఇంకా పవిత్రమైన బంధంగానే భావించబడుతున్నప్పటికీ, వ్యక్తిగత భావోద్వేగ అవసరాలు, జీవనశైలి మార్పులు సంబంధాలపై కొత్త చర్చకు దారితీస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories