Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే

Published : Dec 12, 2025, 07:41 PM IST

Cold wave: తెలంగాణలో చ‌లి విజృంభిస్తోంది. ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతున్నాయి. మ‌రీ ముఖ్యంగా హైదరాబాద్‌లో టెంప‌రేచ‌ర్స్ ఓ రేంజ్‌లో ప‌డిపోతున్నాయి. సింగిల్ డిజిట్స్ న‌మోద‌వుతున్నాయి. వ‌చ్చే 3 రోజులు ప‌రిస్థితి ఇలాగే ఉంటుంద‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. 

PREV
15
రాష్ట్రంపై శీతల గాలుల ప్రభావం పెరుగుతోంది

తెలంగాణలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత ఊహించని స్థాయికి చేరుకుంది. ఉత్తర దిశ నుంచి దూసుకొస్తున్న శీతల గాలులు రాష్ట్ర వాతావరణాన్ని గణనీయంగా చల్లబరుస్తున్నాయి. సాధారణంగా ఉండే కనిష్ఠ ఉష్ణోగ్రతలతో పోలిస్తే 3-5 డిగ్రీలు తగ్గడం వల్ల రాత్రి, తెల్లవారుజామున చలికి జనాలు వణికిపోతున్నారు. వాతావరణ శాఖ ప్రకారం, రాబోయే రెండు–మూడు రోజులు ఇదే స్థాయి చలి కొనసాగే అవకాశం ఉంది.

25
హైదరాబాద్‌లో ఏడేళ్ల త‌ర్వాత

రాష్ట్రంలోని చాలా జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా చ‌లి తీవ్ర‌త పెరుగుతోంది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో నమోదవుతూ, గత ఏడు ఏళ్ల రికార్డులను అధిగమిస్తున్నాయి. హైదరాబాద్‌లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు:

* సెంట్రల్ యూనివర్సిటీ: 6.3°C

* మౌలాలి: 7.1°C

* రాజేంద్ర నగర్: 7.7°C

* శివరాంపల్లె: 8.8°C

* అల్వాల్: 9.0°C

* గచ్చిబౌలి: 9.1°C

* బొల్లారం: 9.3°C

* మారేడ్‌పల్లి: 10.1°C

* కుత్బుల్లాపూర్: 10.2°C

* జీడిమెట్ల: 11°C

35
శివారు ప్రాంతాల్లో మరింత తీవ్ర చలి

హైదరాబాద్ శివార్లలో ఉష్ణోగ్రతలు మరింత దిగజారాయి.

మోయినాబాద్: 5.4°C

ఇబ్రహీంపట్నం: 6.3°C

రాష్ట్రవ్యాప్తంగా చలిగాలులు విస్తరించగా, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిన్నెధరి ప్రాంతంలో 5.4°C నమోదై ఈ సీజన్‌లో ఇప్పటివరకు న‌మోదైన అత్యల్ప ఉష్ణోగ్రతగా గుర్తించారు.

45
పెరుగుతోన్న పొగ‌మంచు

తెల్లవారుజామున ఏర్పడుతున్న పొగమంచు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తోంది. వాహ‌నాలు క‌నిపించ‌క‌పోవ‌డంతో వాహనదారులు వేగం తగ్గించుకోవాల్సి వస్తోంది. ప్రత్యేకంగా జాతీయ రహదారులు, గ్రామీణ మార్గాల్లో ప్రమాదాలు పెరగకుండా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

55
వాతావరణ శాఖ హెచ్చరికలు

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం, ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. శీతల–అతి శీతల గాలులు వీచే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే త్వరలో పొగమంచు మరింత పెరిగే అవకాశం ఉన్నందున వృద్ధులు, చిన్నపిల్లలు, ఉదయం బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ‌చ్చే 3 రోజులు చ‌లి తీవ్ర‌త మ‌రింత పెరిగే అవ‌కాశం ఉందని హెచ్చ‌రిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories