Telangana CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 12వ వార్షిక సదస్సులో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత - కేసీఆర్ కుటుంబ అంతర్గత తగాదాలు, తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం మాట్లాడారు.
కవితను ఆ నలుగురే బయటకు పంపారు : సీఎం రేవంత్ రెడ్డి
Telangana CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశరాజధాని ఢిల్లీలో జరిగిన పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 12వ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ.. మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు కలిసి కల్వకుంట్ల కవితను బయటకు నెట్టేశారని ఆయన అన్నారు. కుటుంబంలోని ఆస్తి పంచుకోవడమే ఈ విభేదాలకు కారణమంటూ వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికి సపోర్ట్ చేయడం లేదనీ, ఇది పూర్తిగా వారి వ్యక్తిగత సమస్య అని రేవంత్ చెప్పారు.
25
కవితపై రాజకీయ వైఖరి రేవంత్ ఎమన్నారంటే?
కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే వ్యతిరేకిస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో తన కుటుంబ కార్యక్రమానికి కవిత అడ్డుపడ్డారని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబం ప్రజల నుండి సామాజిక బహిష్కరణకు గురైందని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యమం పేరుతో యువతను మోసం చేశారని విమర్శించారు. ఇప్పుడు అదే కుటుంబంలో విభేదాలు తలెత్తాయని పేర్కొన్నారు.
35
తెలంగాణ రైజింగ్ 2047
‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంతో రాష్ట్రాన్ని సుస్థిర అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరానికి ఆధునిక రవాణా సదుపాయాలు అవసరమని, ప్రస్తుతం ఉన్న 70 కిలోమీటర్ల మెట్రోను 150 కిలోమీటర్లకు విస్తరించాలనేది లక్ష్యమని చెప్పారు. రోజుకు 5 లక్షల మంది ప్రయాణిస్తున్న మెట్రో రైలులో రాబోయే ఐదేళ్లలో 15 లక్షల ప్రయాణికులు ఉండేలా ప్రణాళికలు రూపొందించారని వివరించారు.
హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డును నిర్మిస్తామన్నారు. హైదరాబాద్-బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ఏర్పాటు ప్రతిపాదన ఉందని ఆయన తెలిపారు. మూసీ నదిని సబర్మతి మాదిరిగా పునరుద్ధరించడానికి మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు కాలుష్యకారక పరిశ్రమలను నగరానికి దూరంగా తరలించి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.
55
తెలంగాణ ఆర్థిక, భద్రతా రంగ ప్రణాళికలు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు పెంచడమే ప్రధాన లక్ష్యమని సీఎం చెప్పారు. దేశ జీడీపీలో 10 శాతం తెలంగాణ నుంచే రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో ‘ఈగల్ స్క్వాడ్’ సమర్థవంతంగా పనిచేస్తోందని, తాజాగా విడుదలైన ర్యాంకింగ్‌లో తెలంగాణ పోలీస్ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.