గత కొన్ని రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య నీటి వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బుధవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో జరిగిన ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ భేటీలో ఒక్కటే అంశాన్ని ప్రధానంగా చర్చకు పెట్టింది. గోదావరి నీటిని బనకచర్లకు అనుసంధానించాలన్న ప్రతిపాదన. గోదావరి జలాల్లోంచి ఏటా 3,000 టీఎంసీల జలాలు వృథా అవుతుండగా, వాటిలో కేవలం 200 టీఎంసీలను మాత్రమే బనకచర్ల ద్వారా తరలించాలన్నది తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది.
ఈ ప్రాజెక్టు ఎగువ రాష్ట్రాలకు నష్టం కలిగించదని, గత పదకొండేళ్లలో తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులకు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని ఏపీ పేర్కొంది. తమ అవసరాలను అర్థం చేసుకోవాలని కేంద్రం, తెలంగాణను ఏపీ ప్రభుత్వం కోరింది.
25
తెలంగాణ 13 అంశాలతో విస్తృత ప్రతిపాదన
తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశానికి 13 కీలక అంశాలను చర్చకు తీసుకొచ్చింది. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల అనుమతుల్లో జాప్యం, కృష్ణా జలాల తరలింపుపై ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీశైలం నుంచి ఇతర బేసిన్లకు నీటి తరలింపును తక్షణం ఆపాలని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు అమలు చేయాలని కేంద్రాన్ని కోరింది.
35
శ్రీశైలం ప్రాజెక్టుపై తెలంగాణ ఆందోళన
శ్రీశైలం డ్యాం నుంచి జరుగుతున్న నీటి తరలింపు విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఆటంకంగా మారుతోందని తెలంగాణ వాదిస్తోంది. అలాగే శ్రీశైలం కుడి కాలువ ద్వారా ఎక్కువ నీటి వినియోగాన్ని నియంత్రించాలని, హంద్రీనీవా, వెలిగొండ లాంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని సమీక్షించాలని కోరింది. శ్రీశైలం డ్యాం భద్రతపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
కృష్ణా నది జలాల అక్రమ తరలింపును అడ్డుకునేందుకు టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ సూచించింది. టెలిమెట్రీల ద్వారా నీటి ప్రవాహాన్ని సరిగ్గా ట్రాక్ చేయవచ్చని, ఏపీ దీనికి అంగీకరించాలని కోరింది. తుంగభద్ర బోర్డులో నీటి వినియోగంపై కూడా సమీక్ష అవసరమని పేర్కొంది.
కొత్త ప్రాజెక్టులపై నిధులు, అనుమతులు
ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి పోలవరం తరహాలో నిధులు మంజూరు చేయాలని తెలంగాణ కోరింది. గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి కావేరీ బేసిన్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని, అందులో 200 టీఎంసీలను వాడుకునే అవకాశం ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరింది. అదేవిధంగా సమ్మక్క సాగర్, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు కేంద్ర సహకారం నిధులు కావాలని పేర్కొంది.
55
కమిటీ వేయాలని నిర్ణయించాం..
ఇద్దరు సీఎంల మధ్య గోదావరి, కృష్ణా నదీ జలాలపై మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేస్తామని కేంద్రం తెలిపిందని, శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారని చెప్పకొచ్చారు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇక కృష్ణా నది బోర్డు అమరావతిలో ఉండేలా నిర్ణయం తీసుకున్నామని.. గోదావరి బోర్డు తెలంగాణలో ఉండేలా నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశౄరు. పోలవరం- బనకచర్లపై టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ సభ్యులతో కమిటీ వేయాలని నిర్ణయించామన్నారు.