Schools Bandh : సెలవు మెసేజ్ వచ్చింది... రేపు స్కూల్స్ కి హాలిడే కన్ఫార్మ్

Published : Jul 08, 2025, 09:54 PM IST

 జులై 9 అంటే రేపు బుధవారం కాార్మిక సంఘాల భారత్ బంద్ నేపథ్యంలో స్కూళ్లకు సెలవు ప్రకటించాయి కొన్ని మేనేజ్మెంట్స్. మీకు సెలవు మెసేజ్ వచ్చిందా?  

PREV
18
బుధవారం భారత్ బంద్

School Holidays : కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI(M))అనుబంధ కార్మిక విభాగం నిరసనకు సిద్దమయ్యింది. ఇందులో భాగంగానే CITU (సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్) యావత్ దేశాన్ని స్తంభింపజేయడానికి రంగం సిద్దం చేసింది... జులై 9 అంటే రేపు బుధవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చింది.

28
విద్యాసంస్థలకు రేపు సెలవు ఉంటుందా?

ఈ భారత్ బంద్ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ఉంటుందా? ప్రభుత్వ పాఠశాలలకు ఎలాగూ అధికారంగా సెలవు ఉండదు... మరి ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల సంగతేంటి? అనే ప్రశ్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో మెదులుతోంది. అయితే దీనిపై కొన్ని స్కూళ్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసాయి. CITU తో పాటు మరికొన్ని కార్మిక సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో స్కూళ్లకు సెలవు ప్రకటించేసాయి. ఈమేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్ లు వచ్చాయి.

38
నాకైతే హాలిడే మెసేజ్ వచ్చేసింది...

ఇలా ఆర్టికల్ రాసే సమయానికి నాకు కూడా రేపు(బుధవారం) స్కూల్ కి సెలవు అనే మెసేజ్ వచ్చింది. అంటే మా పాప చదివే స్కూల్ యాజమాన్యం బంద్ కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ముందుగానే సెలవు ప్రకటించేసింది. ఇలా ఇప్పటికే చాలా సూల్స్ సెలవు ప్రకటించాయి... పేరెంట్స్ కు ఇప్పటికే మెసేజ్ చేసి సమాచారం అందించాయి. దీంతో బుధవారం సెలవుపై చాలామందికి క్లారిటీ వచ్చేసింది.

48
పేరెంట్స్ కి సెలవుపై క్లారిటీ ఏది?

తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని స్కూల్ విద్యార్థులు, పేరెంట్స్ కు ఇంకా క్లారిటీ రావడంలేదు... విద్యాసంస్థల నుండి ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో స్కూల్ ఉందా, లేదా అన్న డైలమాలో ఉన్నారు. 

ఒకవేళ బుధవారం తీరా స్కూల్ కి వెళ్ళాక సెలవని చెబితే అటు విద్యార్ధులు, ఇటు పేరెంట్స్ ఇబ్బందిపడాల్సి వస్తుంది. అలాగే మద్యలో కార్మిక సంఘాల నాయకులు వచ్చి స్కూల్ ను బంద్ చేయించినా ఇబ్బందే. కాబట్టి సెలవుపై విద్యాసంస్థలు ముందుగానే ఓ నిర్ణయం తీసుకుంటే మంచిదని విద్యార్థుల తల్లిదండ్రులు సూచిస్తున్నారు.

58
ఆ విద్యాసంస్థలే సెలవు ఇచ్చేసాయి..

అయితే తెలంగాణ జిల్లాల్లోని విద్యాసంస్థలే ఎక్కువగా బుదవారం బంద్ పాటించి సెలవు ప్రకటిస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లోని కార్పోరేట్ విద్యాసంస్థలు మాత్రం ఇప్పటివరకు సెలవులపై నిర్ణయం తీసుకోలేవు. దీంతో విద్యార్థులు, పేరెంట్స్ లో రేపు ఎలాగన్న కన్ఫ్యూజన్ కొనసాగుతోంది.

68
ఈ రంగాల కార్మికులు బంద్ లో పాల్గొంటున్నారు

ఈ భారత్ బంద్ లో పాల్గొంటున్నట్లు బ్యాంకింగ్ తో పాటు భీమా, తపాలా, బొగ్గుగనులు, జాతీయ రహదారులు, నిర్మాణ రంగాలకు చెందిన కార్మిక సంఘాలు ప్రకటించాయి. అలాగే ఇతర రంగాల కార్మికులు, రైతులు, ఉద్యోగులు కూడా బంద్ కు మద్దతివ్వాలని... కార్మికుల ఐక్యతను చాటాలని సూచిస్తున్నారు. దాదాపు 25 కోట్లమంది ఈ బంద్ లో పాల్గొంటారని కార్మిక సంఘాల నాయకులు అంచనా వేస్తున్నారు.

78
రేపు బ్యాంకులు బంద్?

బ్యాంకింగ్ రంగానికి చెందిన కార్మికులు కూడా రేపు బంద్ లో పాల్గొననున్నారు కాబట్టి బ్యాంకులు మూతపడనున్నాయి. మరికొన్ని ప్రభుత్వ రంగాల ఉద్యోగులు, కార్మికులు కూడా విధులను బహిష్కరించనున్నారు. ఆర్టిసి బస్సులు బయటకు రాకుండా డిపోల వద్ద ఆందోళనలు చేపట్టే అవకాశాలున్నాయి. అలాగే మావోయిస్ట్ ప్రాబల్యం గల ప్రాంతాల్లో వ్యాపారసంస్థలను కూడా మూసివేయించనున్నారు.

88
ప్రజలు బంద్ సహకరించాలి..

ఇలా బంద్ ను విజయవంతం చేయడానికి కార్మికులు ఆందోళనలు చేపట్టవచ్చు... రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ ను అడ్డుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులకు ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు కొనసాగే అవకాశాలున్నాయి. 

అంటే రేపటి బంద్ కారణంగా విద్యార్థులకే కాదు ఉద్యోగులు, వ్యాపారులకు ఇబ్బందుల తప్పవు. కాబట్టి కార్మికుల హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటానికి ప్రజలు కూడా మద్దతిచ్చి సహకరించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories