Holidays : సెలవులే సెలవులు... ఏప్రిల్ లో మొత్తం 30 రోజులుంటే ఏకంగా 15 హాలిడేస్

నూతన ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైన ఈ ఏప్రిల్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు వస్తున్నాయి. నెలలో 30 రోజులుంటే సగంరోజులు అంటే ఏకంగా 15 రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ సెలవుల జాబితా కోసం ఇక్కడ చూడండి. 

Bank Holidays

Bank Holidays : ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఈ ఏప్రిల్ నెలలోనే బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి.  ఈ నెలలో మొత్తం 30 రోజులుంటే అందులో ఏకంగా 15 రోజులు సెలవులు వస్తున్నాయి. కాబట్టి మీకు బ్యాంకులో ఏదయినా పని ఉందంటే ఈ సెలవుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. సెలవు రోజుల్లో బ్యాంకుకు వెళితే పని కాకుండానే వెనుదిరగాల్సి వస్తుంది... దీంతో మీ సమయం వృధా అవుతుంది. అలాకాకుండా మీకు ఈ నెలలో ఏరోజు ఎందుకు సెలవు ఉందో తెలుసుకున్నారంటే ఆరోజు బ్యాంకులకు వెళ్లకుండా ఉంటారు. 

తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్యాంకులకు భారీగానే సెలవులు వస్తున్నాయి. పండగలు, శని, ఆదివారాల్లో సాధారణ సెలవులు కలుపుకుంటే తెలంగాణలో మొత్తం 11 రోజులు, ఆంధ్ర ప్రదేశ్ లో  10 రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ సెలవు రోజుల్లో బ్యాంకులు మాత్రమే మూసివుంటాయి... కానీ నెట్ బ్యాంకింగ్, బ్యాంక్ యాప్స్, యూపిఐ ద్వారా ఆర్థిక లావాదేవీలు యధావిధిగా జరుగుతాయి.  

Bank Holidays in April 2025

ఏప్రిల్ బ్యాంకు సెలవుల జాబితా..: 

ఏప్రిల్ 1 :  ఆర్థిక సంవత్సరం ప్రారంభంరోజున బ్యాంకుల్లో అంతర్గత పనులు ఉంటాయి. కాబట్టి ఈరోజు బ్యాంకులు పనిచేసాయి.... ఖాతాదారులకు మాత్రం సేవలు అందించలేదు. కేవలం అధికారిక కార్యలాపాలు మాత్రమే జరిగాయి. 

ఏప్రిల్ 5 :  తెలంగాణ ప్రభుత్వం బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా అధికారిక సెలవు ప్రకటించింది. ఈ సెలవు బ్యాంకులకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఈ శనివారం బ్యాంకులు బంధ్ కానున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఈరోజు బ్యాంకులు పనిచేస్తాయి. 

ఏప్రిల్ 6 :   ఆదివారం కాబట్టి సాధారణ సెలవు 

ఏప్రిల్ 10 :  మహవీర్ జయంతి సందర్భంగా సెలవు. 

ఏప్రిల్ 12 :  నెలలో రెండో శనివారం కాబట్టి బ్యాంకులకు సెలవు 

ఏప్రిల్ 13 : ఆదివారం... సాధారణ సెలవు 

ఏప్రిల్ 14 :  రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు... ఇదేరోజు తమిళ న్యూ ఇయర్ కూడా ఉంది. 

ఏప్రిల్ 15 : బెంగాలీ న్యూ ఇయర్... పశ్చిమ బెంగాల్, అస్సాం సహా పలురాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు 

ఏప్రిల్ 18 : గుడ్ ఫ్రైడే.  తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు దేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికారిక సెలవు

ఏప్రిల్ 20 : ఆదివారం, సాధారణ సెలవు 

ఏప్రిల్ 21 : గరియ పూజ సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు సెలవు 

ఏప్రిల్ 26 : నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు 

ఏప్రిల్ 27 : ఆదివారం, సాధారణ సెలవు 

ఏప్రిల్ 29 : భగవాన్ పరశురామ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లో బ్యాంకులకు సెలవు 

ఏప్రిల్ 30 :  బసవ జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులు బంద్. తెలంగాణలో కూడా ఆప్షనల్ హాలిడే ఉంది. కానీ బ్యాంకులకు మాత్రం సెలవు ఉండదు. 


school holidays

స్కూళ్లు, కాలేజీలకు కూడా సెలవులు :  

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులకే కాదు విద్యాసంస్థలకు కూడా ఏప్రిల్ లో భారీగా సెలవులు వస్తున్నాయి. ఈ నెలంతా విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి...  ఈ సమయంలో వచ్చే సెలవులు విద్యార్థులు మరింత బాగా ప్రిపేర్ అవడానికి ఉపయోగపడతాయి. ఏప్రిల్ చివర్లో అంటే 24 నుండి వేసవి సెలవులు ప్రారంభంకానున్నాయి.  

ఆంధ్ర ప్రదేశ్ కంటే తెలంగాణలో ఓ సెలవు అదనంగా వస్తోంది. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతికి కేవలం తెలంగాణలో మాత్రమే అధికారిక సెలవు... ఆంధ్ర ప్రదేశ్ లో ఎలాంటి సెలవు లేదు. ఈ ఒక్కరోజు మినహా మిగతా అన్ని సెలవులన్ని తెలంగాణ, ఏపీలో ఒకేలా ఉన్నాయి. 

Latest Videos

click me!