హైదరాబాద్ అంటే బిర్యానీయే కాదు... నగరవాసులు లొట్టలేసుకుంటూ తినే టాప్ 7 వంటకాలివే

Hyderabad Food : భారతీయ వంటకాల్లో హైదరాబాదీ రుచులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ తయారయ్యే వంటకాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. అయితే హైదరాబాద్ అనగానే చాలామందికి బిర్యానీ గుర్తుకువస్తుంది... కానీ ఎన్నో రుచికరమైన వంటలకు హైదరాబాద్ ప్రసిద్ది. అవేంటో తెలుసుకుందాం.

7 Must Try Hyderabadi Dishes A Food Lovers Guide in telugu akp
హైదరాబాదీ వంటకాలు:

హైదరాబాద్... పాత మొఘలాయి సంస్కృతిని, ఆధునిక నగర జీవితాన్ని కలిపే ఒక నగరం. రుచికరమైన వంటలను కోరుకునేవారికి ఈ నగరం "నవాబుల ఆహార స్వర్గం"  వంటిది. ప్రసిద్ధ హైదరాబాదీ వంటకాలు మసాలా, కుకింగ్ స్టైల్, అరేబియన్ మరియు దక్షిణ భారత రుచుల కలయికతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. కారమైన మసాలా, విభిన్నమైన వంట పద్ధతి, అందరూ ఇష్టపడే రుచి, సువాసన కలిగి ఉంటాయి హైదరాబాదీ వంటకాలు. ఇలా హైదరాబాద్ లో తప్పకుండా రుచి చూడాల్సిన 7 వంటకాలేంటో తెలుసుకుందాం.
 

7 Must Try Hyderabadi Dishes A Food Lovers Guide in telugu akp
Hyderabadi Biryani

1. హైదరాబాదీ బిర్యానీ : బిర్యానీ అనేది భారతదేశానికి పరిచయం అయింది హైదరాబాదును నవాబులు పాలించిన కాలంలోనే అంటారు. బాస్మతి బియ్యం, కొద్దిపాటి మసాలా దినుసులు, రుచికరమైన చికెన్ లేదా మటన్ కలిగిన ఇది నిజమైన రాజుల విందు! 

కొద్దిగా రైతా మరియు మిర్చి కా సలాన్ (మిరపకాయ కూర) కలిపి హైదరబాదీ బిర్యానీ తింటే... ఆహా, ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. హైదరాబాదీ బిర్యానీ "దమ్" పద్ధతిలో (మూత పెట్టి ఉడికించే విధానం) తయారు చేస్తారు. ఇది దాని రుచిని మరింత పెంచుతుంది.


Haleem

2. హలీమ్ :  రంజాన్ నెలలో హైదరాబాదులో దీన్ని తినకుండా ఏ ఒక్క ఆహార ప్రియుడు ఉండలేడు. కోడి లేదా మేక మాంసం, పప్పు, గోధుమ, మసాలా దినుసులు కలిపి బాగా ఉడికించి చేసే మెత్తటి ఆహారమమిది...  నోట్లో పెట్టుకుంటే ఇట్టి కరిగిపోతుంది. పక్కనే నిమ్మకాయ, వేయించిన ఉల్లిపాయలు కలిపితే దీని రుచి ఇంకా అదిరిపోతుంది.

Mirchi Ka Salan

3. మిర్చి కా సలాన్ : హైదరాబాదీ బిర్యానీకి సైడ్ డిష్ దీనినే అత్యధికమంది ఇష్టపడతారు. పచ్చి మిరపకాయలు, వేరుశెనగ, కొబ్బరి కలిపి తయారుచేసే ఒక మెత్తటి, కొద్దిగా కారంగా ఉండే గ్రేవీ. దీన్ని సాధారణ అన్నంతో, పరోటాతో కూడా కలిపి తినవచ్చు. కారం తక్కువగా కావాలంటే మిరపకాయలలోని గింజలను తీసేసి ఉపయోగించండి.

Bagara Baingan

4. బగారా బైంగన్ : మెత్తటి కూరలో ఊరిన నోరూరించే వంకాయ వంటకంమిది. వేరుశెనగ, కొబ్బరి, మెంతులు, జీలకర్ర, కరివేపాకు కలిపి చేసే ఒక ప్రత్యేకమైన సైడ్ డిష్. ఇది అన్నం, పరోటా, రోటీలతో అద్భుతంగా ఉంటుంది. ఇది మొఘలాయి, దక్కన్ మరియు అరేబియా వంటకాల కలయికతో తయారైన వంటకం.

Double ka Meetha

5. డబుల్ కా మీఠా : హైదరాబాదీలు బాగా ఇష్టంగా తినే స్వీట్ డెజర్ట్. బ్రెడ్‌ను ఫ్రై చేసి, పాలు, చక్కెర, యాలకుల పొడి, ద్రాక్ష కలిపి తయారుచేసే ఒక అద్భుతమైన స్వీట్. దీన్ని వేడిగా, చల్లగా కూడా తినవచ్చు. దీని తెలుగు వెర్షన్ "బ్రెడ్ హల్వా" అయినప్పటికీ హైదరాబాదీ స్టైల్ టేస్ట్ వేరే లెవెల్.

Osmania Biscuits

6. ఉస్మానియా బిస్కెట్ : టీ + ఉస్మానియా బిస్కెట్ = హైదరాబాద్... ఇది ఎవరూ కాదనలేని నిజం.  కొంచెం ఉప్పు మరియు కొంచెం తీపి కలిసిన బిస్కెట్ ఇది. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఇది నిజాం కాలంలో తయారైన రాయల్ బిస్కెట్.

Qubani Ka Meetha

7. ఖుబానీ కా మీఠా : హైదరాబాదీ పెళ్లిళ్లలో తప్పకుండా ఉండే ఒక స్పెషల్ స్వీట్. ఎండిన బాదం పండ్లను చక్కెరలో నానబెట్టి, కస్టర్డ్, క్రీమ్ కలిపి వడ్డించే ఒక చాలా రుచికరమైన డెజర్ట్. భోజనం చివరిలో తీపిగా ముగించడానికి దీన్ని తప్పకుండా రుచి చూడాలి.

మీరు ఆహార ప్రియులా? అయితే ఈ 7 హైదరాబాదీ వంటకాలను తప్పకుండా రుచి చూడాలి. బిర్యానీ నుండి స్వీట్ వరకు, అన్ని వంటకాలు రాయల్ అనుభూతిని ఇస్తాయి.

Latest Videos

vuukle one pixel image
click me!