Zoho: భారతీయ టెక్ మార్కెట్లో ఇప్పుడు జోహో కంపెనీ పేరు మారుమోగుతోంది. ఇటీవల ఈ కంపెనీ తీసుకొచ్చిన అరట్టై యాప్ గురించి చర్చ నడుస్తున్న వేళ కంపెనీ సీఈఓ శ్రీధర్ వెంబు ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు.
జోహో కంపెనీ అన్ని ఉత్పత్తులు భారతదేశంలో అభివృద్ధి చేస్తున్నారు. తమ గ్లోబల్ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉందని, తమ గ్లోబల్ ఆదాయం పై పన్నులు భారత్‌లోనే చెల్లిస్తున్నట్లు శ్రీధర్ వెంబు చెప్పుకొచ్చారు. Zoho గ్లోబల్ కార్పొరేషన్‌గా భారత్‌లో కేంద్రం కలిగి, 80కు పైగా దేశాలలో కార్యాలయాలు కలిగి ఉంది. అమెరికా తమ ప్రధాన మార్కెట్‌లలో ఒకటని తెలిపారు.
25
భారతీయ కస్టమర్ డేటా భారతదేశంలోనే
భారతీయ కస్టమర్ల డేటా ముంబై, ఢిల్లీ, చెన్నైలోని డేటా సెంటర్లలో నిల్వ చేస్తున్నారు. త్వరలో ఒడిశాలో కూడా ఒక డేటా సెంటర్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. Zoho కి ప్రపంచవ్యాప్తంగా 18కి పైగా డేటా సెంటర్లు ఉన్నాయి. ప్రతి దేశం లేదా ప్రాంతానికి చెందిన డేటా ఆ ప్రాంతంలోనే హోస్ట్ చేస్తున్నారు.
35
సర్వీసులు స్వంత సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లో
తమ అన్ని సర్వీసులు Zoho స్వంత హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఫ్రేమ్‌వర్క్‌లపై నడుస్తాయని శ్రీధర తెలిపారు. దీనికి పైగా, లైనెక్స్ OS, పోస్ట్‌గ్రెస్ డేటాబేస్ వంటి ఓపెన్ సోర్స్ సాంకేతికతలను కూడా ఉపయోగిస్తున్నట్లు వివరించారు.
తమ ఉత్పత్తులు AWS, Azure లేదా GCloudలో హోస్ట్ కావని చెప్పుకొచ్చారు. ప్రత్యేకంగా Arattai కూడా వాటిలో హోస్ట్ కాదని వివరిచారు. కొన్ని రీజనల్ ట్రాఫిక్ వేగం కోసం ఈ సేవలను వాడుతున్నామన్న శ్రీధర్.. డేటా మాత్రం వాటిలో నిల్వ చేయడం లేదని స్పష్టం చేశారు.
55
యాపిల్ స్టోర్‌లో అమెరికా అడ్రస్ ఎందుకు.?
తమ జోహో డెవలపర్ అకౌంట్ యాపిల్ స్టోర్, ప్లేస్టోర్‌లలో అమెరికా అడ్రస్‌తో ఉందన్న శ్రీధర్.. అది ప్రారంభ దశల్లో USలో పని చేసిన ఉద్యోగి ఖాతా రిజిస్టర్ చేసిన కారణంగా జరిగిందన్నారు. అప్పటి నుంచి ఈ చిరునామా మారలేదని చెప్పుకొచ్చారు. అయితే జోహో నిజంగా మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్ అని శ్రీధర్ గర్వంగా తెలిపారు.