iPhone 12: రూ. 19 వేల‌కే ఐఫోన్ 12.. ఎలా సొంతం చేసుకోవాలంటే.?

Published : Sep 29, 2025, 11:47 AM IST

iPhone 12: ఐఫోన్ కొనుగోలు చేయాలని చాలా మంది కోరుకుంటారు. కానీ ధర చూసి వెనుకడుగు వేస్తుంటారు. అయితే ఐఫోన్ డ్రీమ్ ఫిల్ చేసుకోవాలనుకునే వారికి రీఫర్బిష్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. ఐఫోన్‌కు సంబంధించిన ఒక బెస్ట్ డీల్ ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
క్యాషిఫైలో రీఫ‌ర్‌బిష్ ఫోన్లు

ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ సంస్థ క్యాషిఫై రీఫ‌ర్‌బిష్ ఫోన్ల‌ను విక్ర‌యిస్తుంది. సెకండ్ హ్యాండ్ ఫోన్‌ల‌ను ఇందులో విక్ర‌యిస్తారు. స‌హ‌జంగా ఇత‌ర ప్లాట్ ఫామ్స్‌పై కొనుగోలు చేసే సెకండ్ హ్యాండ్ ఫోన్‌ల‌పై ఎలాంటి వారంటీ ఉండ‌దు. కానీ క్యాషిఫైలో మాత్రం 6 నెల‌ల వ్యారంటీ అందిస్తారు. ఇందులో విక్ర‌యించే ఫోన్‌ల‌ను 32 పాయింట్ క్వాలిటీ చెకింగ్ ఉంటుంది. అలాగే 15 రోజుల రీఫండ్ కూడా అందిస్తారు. అయితే ఇది కొన్ని ష‌ర‌తుల‌కు లోబ‌డి ఉంటుంది.

25
త‌క్కువ ధ‌ర‌కు ఐఫోన్ 12

యాపిల్ ఐఫోన్ 12, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్ ఫోన్‌ను సొంతం చేసుకోవాలంటే ప్ర‌స్తుతం క‌నీసం రూ. 40 వేలు అయినా పెట్టాల్సిందే. అయితే క్యాషిఫైలో కేవ‌లం రూ. 19,899కే ల‌భిస్తోంది. అలాగే యూపీఐ యాప్‌తో కొనుగోలు చేస్తే రూ. 386 డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్‌ను ఈఎమ్ఐ రూపంలో కూడా సొంతం చేసుకోవ‌చ్చు. నెల‌కు రూ. 1700 చెల్లించి కూడా ఫోన్ కొనుగోలు చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ రూ. 799 అద‌నంగా చెల్లిస్తే మ‌రో 6 నెల‌ల వారంటీ ల‌భిస్తుంది. ఫోన్ కొనుగోలు చేయడానికి, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

35
ఐఫోన్ 12 ప్రత్యేకతలు

* అద్భుతమైన డిస్‌ప్లే

6.1 అంగుళాల (15.5 సెం.మీ) Super Retina XDR డిస్‌ప్లే

అత్యుత్తమ రంగులు, స్పష్టతతో సినిమాలు, గేమ్స్ చూడటానికి అనువుగా ఉంటుంది.

* ఈ ఫోన్ సెరామిక్ షీల్డ్ టెక్నాలజీతో రూపొందించారు.

45
శక్తివంతమైన పనితీరు

* A14 Bionic Chip ఉప‌యోగించారు. ఐఫోన్ 12 లాంచ్ స‌మ‌యంలో ఇది ప్రపంచంలోనే వేగవంతమైన స్మార్ట్‌ఫోన్ చిప్‌గా పేరుగాంచింది.

* గేమింగ్, వీడియో ఎడిటింగ్, మల్టీటాస్కింగ్ అన్ని పనుల్లో సూపర్ స్పీడ్ ఇస్తుంది.

55
కెమెరా ఫీచర్లు

* డ్యూయల్ కెమెరా సిస్టమ్ (12MP Ultra Wide + 12MP Wide)

* నైట్ మోడ్, డీప్ ఫ్యూజన్, Smart HDR 3 వంటి అధునాతన ఫీచర్లు.

* 4K Dolby Vision HDR రికార్డింగ్ సపోర్ట్ – సినిమా లాంటి క్వాలిటీ వీడియోలు తీయొచ్చు.

* 12MP TrueDepth ఫ్రంట్ కెమెరా – నైట్ మోడ్, 4K HDR వీడియో రికార్డింగ్ తో సెల్ఫీలు మరింత అద్భుతంగా వస్తాయి.

అదనపు ఫీచర్లు

* IP68 వాటర్ రెసిస్టెన్స్ – నీటిలో పడినా సురక్షితంగా ఉంటుంది.

* MagSafe సపోర్ట్ – వైర్‌లెస్ చార్జింగ్ వేగంగా జరగడం, యాక్ససరీస్ సులభంగా అతికించుకోవడం.

* తాజా iOS ఫీచర్లు – కొత్త హోమ్ స్క్రీన్ విడ్జెట్లు, App Library, App Clips వంటివి అందుబాటులో ఉంటాయి.

గమనిక: ఈ వివరాలను ఆన్ లైన్ లో అందుబాటులో సమాచారం ఆధారంగా అందించడమైంది. ఫోన్ ను కొనుగోలు చేసే ముందు అన్ని చెక్ చేసుకొని కొంటే మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories